e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home జిల్లాలు సిద్ధాంతాలు, విధానాలు ఏమైనయ్‌?

సిద్ధాంతాలు, విధానాలు ఏమైనయ్‌?

సిద్ధాంతాలు, విధానాలు ఏమైనయ్‌?

వామపక్ష భావాలు ఎక్కడపోయినయ్‌?
రైతుబంధు డబ్బులు వాపస్‌ ఎందుకియ్యలే?
ఆస్తుల రక్షణ, కేసుల నుంచి తప్పించుకునేందుకు కాదా? నువ్వు బీజేపీలో చేరింది..
ఆ పార్టీలో నీకు నచ్చిన సిద్ధాంతాలేవో ప్రజలకు చెప్పు
ఈటలపై మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం ధ్వజం

హన్మకొండ, జూన్‌ 15: ఆస్తులను కాపాడుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకొనేందుకే మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరారని మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండిపడ్డారు. మంగళవారం హన్మకొం డ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరితే సముచిత స్థానం ఉంటుందని, కానీ కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో చేరి పరాభవం మూటగట్టుకోవడం జాలిగా ఉందన్నారు. బీజే పీలో మీకు కనిపించిన మార్పు, నచ్చిన అంశాలు, సిద్ధాం తాలు ఏమిటో ప్రజలకు చెప్పాలని శ్రీహరి డిమాండ్‌ చేశా రు. ‘విభజన చట్టంలోని అంశాలను అమలు చేసిందా.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చిందా.. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీకి పచ్చజెండా ఊపిందా.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ ఏర్పా టు చేసిందా.. అన్నింటికి మించి ఏడేళ్లలో పేదల స్థితిగతు లు ఏమైనా మారాయా’ అని ఆయన ప్రశ్నించారు.

మత విద్వేషాలు, అధికారం అడ్డుపెట్టుకొని నాయకులను బ్లాక్‌ మెయిల్‌ చేసి లొంగదీసుకొనే పార్టీ బీజేపీ అని మండిప డ్డారు. ఈడీ దాడులతో దేశంలో గుత్తాధిపత్యం చెలాయి స్తున్న పార్టీలో నీవు ఏ మొఖం పెట్టు కొని చేరావని ప్రశ్నిం చారు. ఈటల రాజేందర్‌కు సీఎం కేసీఆర్‌ సముచిత స్థానం కల్పించాడని, రెండు పర్యాయాలు మంత్రి పదవి ఇచ్చారని కడియం పేర్కొన్నారు. కేసీఆర్‌ది రాచరికం, ఫ్యూడల్‌ వ్యవస్థ అని మాట్లాడావు.. మరి బీజేపీలో ఉన్నది ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుత ఫ్యూడల్‌ వ్యవస్థకు ప్రతినిధిగా నీవు ఉన్నావని అనిపిస్తోందని అన్నారు. వేల కోట్ల విలువ చేసే ఆస్తులు, వందల ఎకరాల భూముల కబ్జాలు, లక్షల కోట్లు వెచ్చించి వివాహాలు చేయడం ఏ సోషలిస్టు, కమ్యూనిస్టు భావాలన్నారు. రైతుబంధు గురించి మాట్లాడిన నీవు ఏటా రూ. 26 లక్షలు తీసుకున్నావు.. ఎందుకు ప్రభుత్వానికి వాపస్‌ ఇవ్వలేదన్నారు.

- Advertisement -

అసైన్డ్‌, ఆలయ భూములు కొను గోలు చేశానని ఒప్పుకున్నావు కదా… ఇది చట్ట వ్యతిరేకం కాదా.. వీటిని ఎందుకు సర్కారుకు అప్పగించలేదన్నారు. భూ ఆక్రమణల నేపథ్యంలో బర్త్ఫ్‌ చేసిన తర్వాతే, బీజేపీ నుంచి అష్యూరెన్స్‌ వచ్చాకే రాజీనామా చేసి ఆ పార్టీలో చేరావని కడియం పేర్కొన్నారు. ఐదేళ్లుగా అభిప్రాయ భేదంతో ఉన్నావన్నావు.. ఇంతకాలం ఆత్మవంచన చేసిన ట్లు కాదా.. సీఎం పనితీరు బాగాలేదని భావించినప్పుడు ముందే రాజీనామా చేస్తే ప్రజలు నిన్ను విశ్వసించే వారు కదా అని ప్రశ్నించారు. అధికారం లేకుండా నీవుండ లేవు కాబట్టే బీజేపీలో చేరావని అన్నారు. వెస్ట్‌బెంగాల్‌లో మమతాబెనర్జీని ఓడిచేంచేందుకు బీజేపీ నేతలు తోడేళ్ల వలె మూకుమ్మడి దాడి చేసినప్పటికీ, అక్కడి ప్రజలు షాక్‌ ఇచ్చా రని విమర్శించారు.

బెంగాల్‌ తరహాలోనే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను అస్థిరపరిచే కుట్ర బీజేపీ పన్నుతోందని, ఇక్క డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణలో బీజేపీ సంస్థాగత నిర్మాణం లేని పార్టీ అని, అసలు ఆ పార్టీకి ఉనికే లేదన్నారు. ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగైపోయిందని పేర్కొన్నారు. రాష్ట్రం లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిగా మారాయన్నారు. 2020-21 వానకాలం, యాసంగి సీజ న్‌లో 1.10 కోట్ల ఎకరాల్లో వరిసాగు జరిగి, 3 కోట్ల టన్ను ల ధాన్యం దిగుబడి వచ్చి దేశంలోని రికార్డు నమోదు చేసిం దని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే అన్నంపెట్టే స్థాయి లో ఉందని శ్రీహరి పేర్కొన్నారు. మరో ఇరవై ఏళ్ల వరకు కేసీఆర్‌ను ఎదుర్కొనే వారు లేరని, ఇక్కడి రాజకీయాల్లో ఆయనే ఏకైక బాహుబలి అని కడియం అభివర్ణించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సిద్ధాంతాలు, విధానాలు ఏమైనయ్‌?
సిద్ధాంతాలు, విధానాలు ఏమైనయ్‌?
సిద్ధాంతాలు, విధానాలు ఏమైనయ్‌?

ట్రెండింగ్‌

Advertisement