e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home జిల్లాలు నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలి

నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలి

నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలి

ఆదిలాబాద్‌ ఇన్‌చార్జి ఎస్పీ ఎం.రాజేశ్‌ చంద్ర
అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ తనిఖీ

బేల, జూన్‌ 15: మహారాష్ట్ర నుంచి జిల్లాకు నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలని ఇన్‌చార్జి ఎస్పీ ఎం.రాజేశ్‌ చంద్ర సూచించారు. మండలంలోని శంకర్‌గూడ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును, పోలీసు స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ చెక్‌పోస్ట్‌ వద్ద నిఘాను కట్టుదిట్టం చేసి వాహనాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నకిలీ విత్తనాలు సరఫరా చేసేవారిని పట్టుకోవాలన్నారు. గ్రామాల్లో పర్యటించి శాంతిభద్రతలు కాపాడాలన్నారు. కేసులను త్వరగా దర్యాప్తు చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చాలన్నా రు. అనంతరం మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ పరిస్థితిని పరిశీలించా రు. ఆయన వెంట సీఐ మల్లేశ్‌, ఎస్‌ఐ సాయన్న, ట్రైనీ ఎస్‌ఐ కల్యాణ్‌, పోలీసులు పాల్గొన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్టు
ఖానాపూర్‌ రూరల్‌, జూన్‌ 15: నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని నిర్మల్‌ డీఎస్పీ ఉపేంద్రారెడ్డి హెచ్చరించారు. మండలంలోని బీర్నంది గ్రామంలో రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లైసెన్సు ఉన్న ఫర్టిలైజర్‌ దుకాణాల్లో విత్తనాలను కోనుగోలు చేసి రసీదు తీసుకోవాలన్నారు. దీంతో విత్తనాలు మొలకెత్తకుంటే విక్రయదారులను అడిగే వీ లుంటుందని పేర్కొన్నారు. విత్తనాల విషయంలో సందేహాలు ఉంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. ఖానాపూర్‌ ఎస్‌ఐ రామునాయక్‌, ఏర్వచింతల్‌ సర్పంచ్‌ కొడారి గోపాల్‌, ఉప సర్పంచ్‌ శంకర్‌, మాజీ సర్పంచ్‌ చంద్రవాస్‌ నాయకులు సాయి లక్ష్మణ్‌రావు, శ్రీధర్‌, నవీన్‌ గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలి
నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలి
నకిలీ విత్తనాల రవాణాను అరికట్టాలి

ట్రెండింగ్‌

Advertisement