e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home జిల్లాలు ఓరుగల్లు నుంచే ‘విజయగర్జన’

ఓరుగల్లు నుంచే ‘విజయగర్జన’

  • టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాలకు వరంగల్‌ మహానగరం వేదిక
  • నవంబర్‌ 15న భారీ ఎత్తున సభ నిర్వహణ
  • ‘తెలంగాణ విజయగర్జన’ సభగా నామకరణం
  • ఖరారు చేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌
  • పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడి
  • ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి, చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌కు ఆదేశాలు
  • నాయకులు, కార్యకర్తల్లో నయాజోష్‌

వరంగల్‌, అక్టోబర్‌ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :స్వరాష్ట్ర సాధనే ధ్యేయంగా పురుడుపోసుకొని.. అనుకున్న లక్ష్యాన్ని సాధించి.. తెచ్చుకున్న తెలంగాణను ప్రగతి వైపు నడిపిస్తున్న టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 20ఏళ్లు పూర్తయిన శుభతరుణాన్ని మహోత్సవంలా జరుపుకొనేందుకు మన ఓరుగల్లు వేదిక కానుంది. సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ, మండల, పట్టణ కమిటీలు ఇప్పటికే కొలువుదీరగా ఈ నెల 25న పార్టీ అధ్యక్షుడి ఎన్నిక అనంతరం నవంబర్‌ 15న ‘ద్విదశాబ్ది ఉత్సవాల సభ’ను వరంగల్‌లోనే నిర్వహించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. తనకు సెంటిమెంట్‌గా ఉన్న వరంగల్‌లోనే ‘తెలంగాణ విజయగర్జన’ పేరిట భారీ సభ ఏర్పాటు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్‌ ఖరారు చేసిన మేరకు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించగానే ఉమ్మడి జిల్లా నాయకులు, కార్యకర్తల్లో నయాజోష్‌ నెలకొంది.

చారిత్రక నగరంగా ప్రసిద్ధిగాంచిన వరంగల్‌ మొదటి నుంచీ సామాజిక, రాజకీయ ఉద్యమాలకు చిరునామాగా ఉంటున్నది. దోపిడీని ఎదుర్కొని స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా మొదలైన తెలంగాణ ఉద్యమంలో వరంగల్‌ పాత్ర ఎనలేనిది. తెలంగాణ ఉద్యమంలో ఏ పిలుపు ఇవ్వాలన్నా, స్వరాష్ట్రంలో సంక్షే మ పథకాలకు నాంది పలకాలన్నా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు వరంగల్‌ సెంటిమెంట్‌గా నిలిచింది.

- Advertisement -

రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు, టీఆర్‌ఎస్‌ ప్రస్థానంలో గొప్ప మలుపులకు ఓరుగల్లు కేంద్రంగా ఉంటున్నది. ఈ పరంపర ఇలానే కొనసాగుతున్నది. టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించి 20 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ద్విదశాబ్ది ఉత్సవాల సభను వరంగల్‌లో నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించా రు. ‘తెలంగాణ విజయగర్జన సభ’ పేరుతో నవంబర్‌ 15న భారీ బహిరంగసభను వరంగల్‌ నగరంలో ఏ ర్పాటు చేయనున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. సభ కోసం ఏర్పాట్లు మొదలుపెట్టాలని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌ వినయ్‌భాస్కర్‌లను ఆదేశించారు. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ ద్విదశాబ్ది ఉత్సవాల సభ కోసం ఏర్పాట్లు మొదలవుతున్నాయి. భా రీ బహిరంగసభ కావడంతో దీనికి అనుగుణంగా ఏ ర్పాట్లు చేయనున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల మధ్య ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రజలు, టీఆర్‌ఎస్‌ శ్రేణు లు పెద్ద సంఖ్యలో తరలివచ్చే కార్యక్రమం కావడం తో అనువైన స్థలాన్ని ఎంపిక చేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా ఉన్న వరంగల్‌లోనే మరోసారి కీలక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నది.

మొదటి నుంచీ ఓరుగల్లే..
టీఆర్‌ఎస్‌కు ఉద్యమ పరంగా, రాజకీయంగా కలి సి వచ్చిన కార్యక్రమాలు వరంగల్‌ నుంచే మొదలయ్యాయి. జాతీయ స్థాయిలో టీఆర్‌ఎస్‌కు, తెలంగా ణ ఉద్యమానికి కలిసి వచ్చిన ఎన్నో పరిణామాలు వరంగల్‌ కేంద్రంగానే జరిగాయి. టీఆర్‌ఎస్‌ ఆవిర్భా వం ముఖ్యమైన కార్యక్రమాలు, మంత్రుల రాజీనా మా తర్వాత సభలు, తెలంగాణ సాధన లక్ష్యంగా ‘కేసీఆర్‌ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ నినాదం ప్రకటన అన్నీ వరంగల్‌లోనే జరిగాయి. రాష్ట్ర సాధన ల క్ష్యంగా సాగిన ఉద్యమం, తెలంగాణ ఏర్పడిన తర్వా త మొదలైన ఎన్నో సంక్షేమ పథకాలకు వరంగల్‌ ఘ టనలే స్ఫూర్తిగా నిలిచాయి. గ్రామాల ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మార్చిన చెరువుల పునరుద్ధరణకు ఓరుగల్లును పాలించిన కాకతీయులు స్ఫూర్తిగా ఉన్నా రు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ములుగు సమీపంలో ని తండాలో పెండ్లి ఖర్చుల కోసం దాచిపెట్టిన డబ్బు అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఘటనపై చలించే సీ ఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాలను తెరపైకి తెచ్చారు. వరంగల్‌ నగర పర్యటన నుంచే డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల పథకాన్ని అమలు చేశారు. మరోసారి వరంగల్‌ నుంచే పార్టీలో నూతనోత్సాహం నింపే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు.

27న సన్నాహక సమావేశాలు..
టీఆర్‌ఎస్‌ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా చివరి అంకానికి సంబంధించిన షెడ్యూల్‌ను పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు. ఈ నెల 25న పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎన్నిక పూర్తి కానుంది. ఆలోపే అన్ని జిల్లాల అధ్యక్ష ఎన్నికలు జరిగేలా షెడ్యూల్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా అధ్యక్షులు.. కమిటీల ఎన్నికల అనంతరం అన్ని నియోజకవర్గాల్లో ఈ నెల 27న ‘తెలంగాణ విజయగర్జన సభ’ సన్నాహక సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం నిర్ణయించిం ది. ఒకేరోజు అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ సమావేశాలు జరుగనుండగా వరంగల్‌ సభకు పూర్తి స్థాయిలో పార్టీ నాయకులు, శ్రేణులు సన్నద్ధం కానున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement