e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home జిల్లాలు అందుబాటులో.. ఆధునిక వైద్యం

అందుబాటులో.. ఆధునిక వైద్యం

ప్రారంభానికి సిద్ధంగా 100 పడకల దవాఖాన
జడ్చర్లలో ఏర్పాటు చేసిన సర్కార్‌

జడ్చర్ల, సెప్టెంబర్‌ 13 : ఆధునిక వైద్య స దుపాయాలతో పేదలకు వైద్యాన్ని మరింత చేరువ చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభు త్వం జడ్చర్లలో 100 పడకల దవాఖాన నిర్మిస్తున్నది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని గంగాపూర్‌ ప్రధాన రహదారికి ఆనుకొని నిర్మిస్తున్న దవాఖాన పనులు తుదిదశకు చేరుకున్నాయి. మూడెకరాల విస్తీర్ణంలో రూ.20 కో ట్ల నిధులతో నిర్మిస్తున్న దవాఖాన జడ్చర్ల ని యోజకవర్గానికే తలమానికంగా మారనున్న ది. దవాఖాన ఏర్పాటుతో జడ్చర్ల, మిడ్జిల్‌, భూత్పూర్‌, తిమ్మాజిపేట మండలాల ప్రజల కు మెరుగైన, ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. జడ్చర్ల మీదుగా 167, 44వ జాతీయ రహదారులు వెళ్తుండడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో క్షతగాత్రులను జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాల్సిందే. దీంతో సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కూడా కోల్పోతున్న సంఘటనలు ఉన్నాయి. జడ్చర్లలో ఏర్పాటు చేస్తున్న దవాఖానతో క్షతగాత్రులను వెంటనే తరలించి వైద్యం అందించే అవకాశం ఉం టుంది. 2018లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేసి దవాఖాన నిర్మాణానికి శ్రీ కారం చుట్టారు. ఒకప్పుడు సర్కార్‌ దవాఖా న అంటే భయపడే జనం ఇప్పుడు ప్రభుత్వ దవాఖాల్లోనే చిక్సితలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న దవాఖాన ప్రారంభానికి సిద్ధమవుతుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

మెరుగైన వైద్యం అందించాలనే..
జడ్చర్లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ఉద్దేశంతో వంద పడకల దవాఖాన నిర్మిస్తున్నాం. ఈ దవాఖాన ఏర్పాటుతో అధునాతన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రతి విభాగానికి డాక్టర్లు ఉండడంతో అన్ని రకాల చికిత్సలు చేయనున్నారు. ఆక్సిజన్‌ సౌకర్యం ఉంటుంది. మహిళలకు, పురుషులకు, చిన్నారులకు వేర్వేరుగా వార్డులు, ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

  • డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana