ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
కుంటాల, జూన్, 13 : మండల ప్రజల ఇలవే ల్పు అయిన శ్రీ గజ్జలమ్మ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అ న్నారు. ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గాలి గోపురం, ప్రహరీ నిర్మాణానికి సంబంధిం చి ప్లాన్ మ్యాప్, ప్రణాళిక ప్రతులను సభ్యులు ఎమ్మెల్యేకు ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 32 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు త్వరలోనే దేవాదాయ శాఖ నుంచి పరిపాలన అనుమతు లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గజ్జలమ్మ ఆలయ అభివృద్ధికి నిధుల మంజూరుకు కృషి చేస్తున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి , ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి సభ్యులు కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మం డల కన్వీనర్ పడకంటి దత్తు ఉన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
ముథోల్, జూన్, 13 : మండలంలోని చించా ల గ్రామానికి చెందిన కావ్య, విశ్వనాథ్ దంపతుల కుమారుడు ఇటీవల ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందాడు. దీంతో సీఎం సహాయ నిధి నుంచి రూ. 57 వేలు మంజూరు కాగా ఎమ్మె ల్యే విఠల్ రెడ్డి చెక్కును లబ్ధిదారుకు అందజేశా రు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అప్రోజ్ ఖా న్, నాయకులు సూర్యం రెడ్డి, రాజేశ్వర్, ఖాలీద్, తదితరులు ఉన్నారు.