e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

లక్షెట్టిపేట రూరల్‌, మే 13: కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రంజాన్‌ పండుగను జరుపుకోవాలని మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ పేర్కొన్నారు. పట్టణంలోని పోలీస్‌ స్టేషన్‌లో జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట సీఐలు, ఎస్‌ఐలతో కలిసి గురువారం లక్షెట్టిపేట శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన జా గ్రత్తలను ఎస్‌ఐలకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇండ్లల్లోనే ప్రార్థనలు చేసుకోవాలన్నారు. మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచూ చేతులను సబ్బు లే దా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కా ర్యక్రమంలో లక్షెట్టిపేట సీఐ నారాయణ నాయక్‌, లక్షెట్టిపేట ఎస్‌ఐ చంద్రశేఖర్‌, దండేపల్లి ఎస్‌ఐ తాళ్లపల్లి శ్రీకాం త్‌, జన్నారం ఎస్‌ఐ ఆది మధుసూదన్‌, పీస్‌ కమిటీ సభ్యు లు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
ఇందన్‌పెల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ..
జన్నారం, మే13: మండలంలోని ఇందన్‌పెల్లి చెక్‌పోస్ట్‌ వద్ద మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ గురువారం వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరంగా వాహనాలపై తిరిగితే కేసులు నమోదు చేయడంతో పాటుగా వాహనాలను సీజ్‌ చేస్తామ న్నారు. లక్షెట్టిపేట సీఐ నారాయణనాయక్‌, ఎస్‌ఐ మధు సూదన్‌రావు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్‌ నిబంధనలు పాటించాలి

ట్రెండింగ్‌

Advertisement