e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిల్లాలు బెల్లంపల్లిలో మెడికల్‌ కాలేజీని నిర్మించాలి

బెల్లంపల్లిలో మెడికల్‌ కాలేజీని నిర్మించాలి

బెల్లంపల్లిలో మెడికల్‌ కాలేజీని నిర్మించాలి

కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే చిన్నయ్య వినతి
పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌,ఐకే రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌
మంచిర్యాల, మే 31, నమస్తే తెలంగాణ : హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ను బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కలిశారు. సోమవారం తన పుట్టిన రోజును పురస్కరించుకొని వారి నుం చి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి, మంత్రి కేటీఆర్‌ను వేర్వేరుగా కలిసి, వినతిపత్రాలు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మంచిర్యాల జిల్లాకు కేటాయించిన మెడికల్‌ కళాశాలను బెల్లంపల్లిలో నిర్మించాలని కోరారు. ఇం దుకు అవసరమైన వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలం, గతంలోనే నిర్మించిన అసంపూర్తి భవనా లు, సిబ్బందికి సరిపడా సింగరేణి క్వార్టర్స్‌, రవాణాకు అనుకూలమైన రైల్వే, బస్‌ స్టేషన్లు, ఫోర్‌లేన్‌ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. దీంతో పాటు మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలకు, మంచిర్యాల, చెన్నూర్‌, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు బెల్లంపల్లి పట్టణం మధ్యలో ఉం టుందని వివరించారు. మెడికల్‌ కళాశాల నిర్మిస్తే రెండు జిల్లాలు, నాలుగు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే చిన్నయ్య వివరించారు. ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు..
బెల్లంపల్లిరూరల్‌, మే 31: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్యే చిన్నయ్యకు హైదరాబాద్‌లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం, మంత్రి కేటీఆర్‌ను కలిసిన అనంతరం ఆమెను తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బెల్లంపల్లిలో మెడికల్‌ కాలేజీని నిర్మించాలి

ట్రెండింగ్‌

Advertisement