e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ

కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ

కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ

అదనంగా 15 బెడ్ల ఏర్పాటు
శ్రీరాంపూర్‌ ఏరియా జీఎం సురేశ్‌

సీసీసీ నస్పూర్‌ /శ్రీరాంపూర్‌, మే 12 : రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతుండడంతో శ్రీరాంపూర్‌ ఏరియా సింగరేణి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. శ్రీరాంపూర్‌ ఏరియాలో కరోనా బారిన పడుతున్న కార్మికులు, వారి కుటుంబసభ్యుల కోసం ఏరియా జనరల్‌ మేనేజర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. రోగులకు మందులు, సౌకర్యాలపై రోజువారీగా సమీక్షిస్తూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జీఎం సురేశ్‌ నస్పూర్‌కాలనీలో పర్యటించారు. సింగరేణి డిస్పెన్సరీని సందర్శించారు. ఉద్యోగులకు ఇస్తున్న హోం ఐసొలేషన్‌ కిట్‌లను పరిశీలించారు. అనంతరం సేవా భవన్‌లోని కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని సందర్శించి టెస్టులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. నస్పూర్‌కాలనీ సింగరేణి జీటీ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటన్‌కు వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో పాటు వారికి వైద్యం అందిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. సింగరేణి గార్డెన్‌ను క్వారంటైన్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆర్‌కే-8 డిస్పెన్సరీని సందర్శించి టీకాల పంపిణీ వివరాలను తెలుసుకున్నా రు. జీఎం వెంట డీవైసీఎంవో డాక్టర్‌ విజయలక్ష్మి, హెల్త్‌ ఆఫీసర్‌ సుమన్‌, డాక్టర్‌ మురళీధర్‌రావు, క్వారంటైన్‌ సెం టర్‌ ఇన్‌చార్జి కల్లూరి వెంకటరామారావు తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కార్మికుల ఆరోగ్యంపై యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ

ట్రెండింగ్‌

Advertisement