e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిల్లాలు కొవిడ్‌ బాధితులకు ఆర్థిక సాయం

కొవిడ్‌ బాధితులకు ఆర్థిక సాయం

కొవిడ్‌ బాధితులకు ఆర్థిక సాయం

ఫర్టిలైజర్‌సిటీ, జూన్‌ 11: కొవిడ్‌ బారిన పడిన న్యాయవాదులు, మృతుల కుటుంబాలకు మండల న్యాయ సేవాధికార సంస్థ గోదావరిఖని బార్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో గోదావరిఖని 6వ అదనపు న్యాయస్థానం ఆవరణలో శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన 6వ అదనపు జిల్లా న్యాయమూర్తి భారతి లక్ష్మి, కమిషనర్‌ ఉదయ్‌ కుమార్‌ మాట్లాడారు. అనంతరం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇక్కడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి, మున్సిఫ్‌ మెజిస్ట్రేట్లు భార్గవి, జీఎస్‌ఎల్‌ ప్రియాంక, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమరేందర్‌ రావు, ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్‌, కార్యవర్గ సభ్యులు అశోక్‌, రాగిణి, పద్మజ, ప్రదీప్‌కుమార్‌, ఉమర్‌, ముచ్చకుర్తి కుమార్‌, న్యాయవాదులు సీహెచ్‌ శైలజ, గోపాల్‌ రెడ్డి, సతీశ్‌, రామటెంకి శ్రీనివాస్‌, ప్రియాంక, రాము, శంకర్‌ తదితరులు ఉన్నారు.
మంథని టౌన్‌, జూన్‌ 11: కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు స్థానిక కోర్టు ఆవరణలో శుక్రవారం నిత్యావసరాలను పంపిణీ చేశారు. కరోనాతో మృతి చెందిన 8 బాధిత కుటుంబాలకు బార్‌ అసోసియేషన్‌, న్యాయ విజ్ఞాన సదస్సు ఆధ్వర్యంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వరరావు, మంథని ఆడిషనల్‌ జూనియర్‌ జడ్జి శ్రీధర్‌ నిత్యావసరాలను అందజేశారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు హరిబాబు, ప్రధాన కార్యదర్శి వెంకటరాంరెడ్డి, సీనియర్‌ న్యాయవాదులు రఘోత్తమరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ట్రెజరర్‌ ఆంజనేయులు, మంథని సీఐ సతీశ్‌, ఎస్‌ఐ చంద్రకుమార్‌, న్యాయవాదులు కటకం శ్రీనివాస్‌, ఆర్ల నాగరాజు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొవిడ్‌ బాధితులకు ఆర్థిక సాయం

ట్రెండింగ్‌

Advertisement