e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు కలిసికట్టుగా పనిచేద్దాం..

కలిసికట్టుగా పనిచేద్దాం..

కలిసికట్టుగా పనిచేద్దాం..

ఎదులాపురం,జూన్‌11 : ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు కలిసి కట్టుగా పని చేసి జిల్లాను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామని ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌లో స్థాయీ సంఘాల సమావేశాలు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వానకాలం పంటల సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మారుమూల జిల్లా అయిన ఆ దిలాబాద్‌ జిల్లాకు టీ-డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ను మంత్రి ఐకే రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న ప్రారంభించారని గుర్తుచేశారు. జిల్లాలో నా లుగు పరిశ్రమలు స్థాపించి ఎస్సీ ,ఎస్టీ ,బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం సహకార, జిల్లా పరిశ్రమల శాఖలు సమస్వయంతో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. కోరం లేకపోడంతో విద్య, వైద్యం నాలుగో స్థాయీ సంఘం వాయిదా పడింది. సమావేశంలో జడ్పీ సీఈవో గణపతి, జడ్పీటీసీలు తాటిపల్లి రాజు, సుభద్రాబాయి, చారులత, ఆరుంధతి, గోక గణేశ్‌ రెడ్డి, కుమ్ర సుధాకర్‌, మల్లేపూల నర్స య్య, వివిధ శాఖల అధికారులు డీఆర్‌డీఏ ఏపీడీ రవీందర్‌ రాథోడ్‌, ఐసీడీఎస్‌ పీడీ మిల్కా, డీవైఎస్‌వో, అధికారులు పాల్గొన్నారు.
స్థాయీ సంఘాల అంశాలు..
జడ్పీ కార్యాలయంలో జరిగిన స్థాయి సంఘాల సమావేశంలో ముం దుగా జిల్లా గ్రామీణాబివృద్ధి శాఖ ప్రగతిపై సమీక్షించారు. సంస్థ ద్వా రా సామాజిక, ఆర్థిక , అభివృద్ధి కోసం 10,959 సంఘాలలో రూ. 1,19,371 లతో వివిధ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఇందు లో బ్యాంక్‌ లింకేజీలో 2020-21 సంవత్సరానికి 6811 సం ఘాలకు రూ.16784.60 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించామని చెప్పారు. ఈ సంవత్సరం మార్చి వరకు 2021 వరకు 4,836 సంఘాలకు రూ.15, 467, 11 కోట్ల మంజూరు చేశారని తెలిపారు. అలాగే స్త్రీనిధి కింద 17 మం డలాల్లో 2020-21 సంవత్సరానికి గాను రూ.15. 97 కోట్ల లక్ష్యం ఉండగా రూ.18.87 కోట్ల రుణాలు మంజూరు చేశామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఆసరా పింఛన్లు 2021 మార్చిలోగా 65, 950 లబ్ధిదారులకు రూ.1,49,38 272 పంపిణీ చేశామన్నారు. అ నంతరం గుడిహత్నూర్‌ జడ్పీటీసీ బ్రహ్మానంద్‌ మాట్లాడుతూ మండలంలో ఉపాధి హమీ కూలీలకు సరైనా సమయంలో డబ్బులు రావ డం లేదని, పని చేయని వారికి కూలీ డబ్బులు ఇస్తున్నారన్నారు. వెం టనే విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్మన్‌ అధికారిని ఆదేశించారు. అలాగే రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, జిల్లా యువజన, క్రీడలు, సహకార, పరిశ్రమలు, జిల్లా ఉపాధి కల్పన, జిల్లా పౌర సరఫరాల, ఆర్టీసీ, డీపీవో, ఐసీడీఎస్‌, ఐసీడీఎస్‌, వివిధ శాఖల ప్రగతిపై చర్చిచారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కలిసికట్టుగా పనిచేద్దాం..

ట్రెండింగ్‌

Advertisement