e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home జిల్లాలు శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

ఆరె కులస్తులకు అండగా ఉంటా
జడ్పీ వైస్‌ చైర్మన్‌ కృష్ణారావు
ఛత్రపతి విగ్రహావిష్కరణ

చింతలమానేపల్లి, జూన్‌ 11 : ప్రతి ఒక్కరూ ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు పిలుపునిచ్చారు. మండలంలోని రణవెల్లి శివాజీ కూడలి వద్ద శుక్రవారం ఛత్రపతి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రణవెల్లి గ్రామస్తులు, ఆరె కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మహిళలు భక్తి శ్రద్ధలతో శివాజీ చిత్రపటానికి పూజలు చేశారు. ఆరె సంఘం జిల్లా అధ్యక్షుడు డుబ్బుల నానయ్య జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వైస్‌ చైర్మన్‌ మాట్లాడారు. ఆరె కులస్తులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీటీసీ డుబ్బుల శ్రీదేవి, ఆరె కుల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి డుబ్బుల వెంకయ్య, ఆరె కుల సంఘం మండలాధ్యక్షుడు భీంకరి నారాయణ, సర్పంచ్‌ సోమేశ్‌, కాగజ్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ డోకె రాజన్న, ఆరె కుల సంఘం కౌటాల మండలాధ్యక్షుడు వసంత్‌రావు, తాలూకా నాయకులు బాజీరావు, వానుపటేల్‌, బాండు, తుస్సె పోశన్న, శివరాం, కార్తిక్‌, సుధాకర్‌, శేఖర్‌, ఆరె కులస్తులు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
రైతు బీమా పత్రాల అందజేత..
ఎంపీడీవో కార్యాలయంలో రైతు బీమా ప్రొసీడింగ్‌ పత్రాలను జడ్పీ వైస్‌ చైర్మన్‌ లబ్ధిదారులకు అందించారు. మండలంలో ఇప్పటి వరకు 15 మంది రైతులు మృతిచెందగా, 14 మందికి రైతు బీమా వచ్చిందని తెలిపారు. తెలంగాణ సర్కారు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా, రైతు బంధు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. కో ఆప్షన్‌ సభ్యుడు నాజీం హుస్సేన్‌, సహకార సంఘం వైస్‌ చైర్మన్‌ మారుతి, వైస్‌ ఎం పీపీ డుబ్బుల వెంకయ్య, ఏఈవోలు కృపారాణి, విజయ్‌, లబ్ధిదారులు, రైతులు పాల్గొన్నారు.
సీసీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ..
కాగజ్‌నగర్‌టౌన్‌, జూన్‌ 11 : మండలంలోని ఎన్జీవోస్‌ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణానికి జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదన్నారు. ఇందులో భాగంగా సుమారు రూ.6 లక్షల అంచనా వ్యయంతో సీసీరోడ్డు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు టేకం భీంబాయి, పోశెట్టి, ఉప సర్పంచ్‌ పున్నం, మం డల కోఆప్షన్‌ సభ్యుడు మహబూబ్‌ ఖాన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పుంజుమేర, షఫి, బాలాజీరావు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
శివాజీని ఆదర్శంగా తీసుకోవాలి

ట్రెండింగ్‌

Advertisement