e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు కొనసాగుతున్న ఇంటింటి సర్వే

కొనసాగుతున్న ఇంటింటి సర్వే

కొనసాగుతున్న ఇంటింటి సర్వే

పెద్దమందడి, మే 11 : మండలంలోని దొడగుంటపల్లి గ్రా మంలో బుధవారం ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటింటి సర్వేను చేపట్టారు. కరోనా వ్యా ప్తి వేగంగా విస్తరించడంతో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ఆరో గ్య సమస్యలతో బాధపడుతున్న వారిని గుర్తించి నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో సర్వే చేపట్టిన ట్లు ఏఎన్‌ఎం తెలిపారు. అదేవిధంగా ఎవరైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలని ఆమె గ్రామస్తులకు సూచించారు. కరోనా లక్షణా లు కనిపిస్తే వెంటనే కరోనా టెస్ట్‌ చేయించుకొని వీలైనంత వరకు అందరికీ దూరంగా ఉండాలని వారు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యాలయసిబ్బంది ఉన్నారు.
పాన్‌గల్‌లో..
పాన్‌గల్‌, మే 11 : మండలకేంద్రంతోపాటు అన్నారం, కేతేపల్లి, రేమద్దుల, బుసిరెడ్డిపల్లి, తెల్లరాళ్లపల్లి తదితర గ్రామా ల్లో ఫీవర్‌ సర్వేను శనివారం వైద్య బృందాల ఆధ్వర్యంలో ఇంటింటా చేపట్టారు. ఆయా గ్రామాల్లో మండల ఆరోగ్య సమన్వయకర్త శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి సర్వే చేశారు. మండలంలోని అన్ని గ్రా మాలు కలిపి మొత్తం 2854 కుటుంబాలను కలిసి ఫీవర్‌ సర్వే నిర్వహించారు. జ్వరం, దగ్గు, నొప్పులు, విరేచనాల వంటి లక్షణాలు ఉన్న అనుమానితులను 176 మందిని గుర్తించారు. అందులో 41మందికి మెడికల్‌ కిట్లను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా ఉధృతి ఎక్కువ ఉందని, ప్రతి ఒక్కరూ కరోనా నిబందనలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది ఉన్నారు.
కొత్తకోటలో..
కొత్తకోట, మే 11 : కొత్తకోట మున్సిపాలిటీలోని కరోనా వైరస్‌పై మంగళవారం ఇంటింటా సర్వే నిర్వహించారు. పట్టణంలోని 15వ వార్డు, 2వ వార్డు, 1వ వార్డులో సర్వే కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీడీసీ చైర్మన్‌ చెన్నకేశవరెడ్డి, అధికారుల సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి జ్వరం, దగ్గు, జలుబు ఉంటే వైద్య సిబ్బందికి తెలపాలన్నారు. సర్వేలో కౌన్సిలర్లు రాములుయాదవ్‌, కొండారెడ్డి, ఖాజామైనొద్దీన్‌, రజియొద్దీన్‌, సుభాష్‌, అంగన్‌వాడీ టీచర్‌ చంద్రకళ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కొనసాగుతున్న ఇంటింటి సర్వే

ట్రెండింగ్‌

Advertisement