సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి
ఎరువులు, పురుగు మందు డీలర్లతో సమావేశం
కాల్వశ్రీరాంపూర్, జూన్ 4: హెచ్టీ కాటన్ విత్తనాలు, ైగ్లెఫోసెట్ గడ్డి మందు విక్రయించవద్దని సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి సూచించారు.పెగడపల్లి రైతు వేదికలో ఎరువులు, పురుగు మందుల దుకాణాల డీలర్లతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఐ హాజరై మాట్లాడారు. నకిలీ విత్తనాలు అమ్మినవారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా 420 కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నిషేధించిందని ప్రకటించారు. ఎవరైనా అమ్మితే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇక్కడ ఏవో నాగార్జున, ఏఈవోలు, ఆయా గ్రామాల డీలర్లు, ట్రైనీ ఎస్ఐ తదితరులు పాల్గొన్నారు.
ఓదెల, జూన్ 4: వానకాలం సీజన్ ప్రారంభం సందర్భంగా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు నకిలీవి అమ్మినట్లు తేలితే ఫర్టిలైజర్ డీలర్లపై కఠిన చర్యలు ఉంటాయని ఏవో నాగార్జున హెచ్చరించారు. ఓదెలలోని రైతు వేదిక భవనంలో ఫర్టిలైజర్ డీలర్లతో వ్యవసాయ శాఖ, పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ నకిలీ, హెచ్టీ పత్తి విత్తనాలపై అవగాహన కల్పించారు. విత్తనాలు, ఎరువులు అమ్మినప్పుడు డీలర్లు తప్పని సరిగా రైతులకు రసీదు ఇవ్వాలని కోరారు. సమావేశంలో పొత్కపల్లి ఎస్ఐ లక్ష్మణ్, ఏఈవోలు సంధ్య, కిరణ్, సతీశ్, మౌనిక, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి, జూన్4: బసంత్నగర్లోని పలు ఎరువుల దుకాణాల్లో ఎస్ఐ మహేందర్, ఏవో రాంబాబు తనిఖీ చేశారు. నకిలీ విత్తనాలు అమ్మి తే కఠిన చర్యలు తీసుకుంటామని, రైతులను మభ్యపెట్టి అనుమతిలేని వాటిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాక్ నిల్వలు, రిజిష్టర్లను పరిశీలించారు. వారి వెంట ఏఈవోలు శశిధర్, రూప తదితరులు ఉన్నారు.
సంపూర్ణ సమాచారం
రైతులకు వానకాలం పంటలకు సంబంధించిన సంపూర్ణ సమాచారం రైతువేదికల ద్వారా అందుతున్నదని ఏఈవో శశిధర్ తెలిపారు. పాలకుర్తి రైతువేదికలో క్లస్టర్ రైతులకు శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. వానకాలం పంటల్లో పత్తి విత్తనాల కొనుగోలు సమయంలో రైతులు దుకాణాదారుడి నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో రైతులు జనార్దన్, కాల్వ శ్రీనివాస్, బండారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు.
ముత్తారం, జూన్ 4: సీతంపేట, అడవిశ్రీరాంపూర్, ఖమ్మంపల్లి, ముత్తారంలోని ఫర్టిలైజర్ దుకాణాల్లో ఏవో శ్రీకాంత్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు.