e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home జిల్లాలు కార్మిక క్షేత్రంలో కార్పొరేట్‌ వైద్యం

కార్మిక క్షేత్రంలో కార్పొరేట్‌ వైద్యం

రూ. 250కోట్లతో దవాఖాన నిర్మాణం
అందుబాటులోకి రానున్న అత్యాధునిక సేవలు
సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు
హర్షం వ్యక్తం చేస్తున్న పారిశ్రామిక వాడ ప్రజలు
సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి కృతజ్ఞతలు

పటాన్‌చెరు, ఆగస్టు 2 : ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడ, విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నిలయమైన పటాన్‌చెరులో మల్టీ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు కానున్నది. రూ.250 కోట్లతో 270 పడకలతో ఏర్పాటు చేయనున్న పెద్ద దవాఖానతో ఈ ప్రాంత కార్మికులు, ప్రజలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందనుంది. తద్వారా ప్రజారోగ్యానికి భరోసా ఏర్పడనుంది. సీఎం కేసీఆర్‌ ఈ దవాఖానను ఆదివారం మంజూరు చేశారు. పటాన్‌చెరు ఏరియా దవాఖాన పక్కన ఉన్న ఐదు ఎకరాల్లో దీనిని అత్యాధునికంగా నిర్మిస్తారు. దవాఖాన మంజూరు కు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మంత్రి హరీశ్‌రావు, మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో దవాఖాన ఏర్పాటు కార్యరూపం దాలుస్తున్నది.

ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతమైన పటాన్‌చెరు ప్రజలు, కార్మికుల ఆరోగ్యాలకు సీఎం కేసీఆర్‌ భరోసా కల్పించారు. దాదాపు రూ.250 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర క్యేబినెట్‌ సమావేశంలో మంజూరు చేశారు. పటాన్‌చెరువాసుల కల 100 పడకల దవాఖాన డిమాండ్‌కు కొత్త రూపాన్ని అందజేశారు. ఎవరు ఊహించని రీతిలో ఏకంగా 270 పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను మంజూరు చేశారు. దీంతో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి అభిమానాన్ని చాటుతున్నారు. దవాఖాన మంజూరుకు మంత్రి హరీశ్‌రావు, మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తీసుకున్నారు. ప్రభుత్వం అనుమతులివ్వడంతో లక్షలాది ప్రజలు, కార్మికుల ఆరోగ్యాలకు ధీమా ఏర్పడింది. పటాన్‌చెరు ఏరియా దవాఖాన పక్కన ఉన్న దాదాపు 5 ఎకరాల రూరల్‌ హెల్త్‌ సెంటర్‌ స్థలంలో దవాఖాన నిర్మాణం కానున్నది. నగరంలో లభిస్తున్న వైద్యసేవలన్నీ ఉచితంగా ఇక్కడే లభించనున్నాయి.

- Advertisement -

రూ. 250 కోట్లతో మల్టీ స్పెషాలిటీ దవాఖాన..
పటాన్‌చెరు ప్రాంతవాసులకు బోనాల పండుగరోజు సీఎం కేసీఆర్‌ శుభవార్త వినిపించారు. 270 పడకల మల్టీ స్పెషాలిటీ దవాఖానను పటాన్‌చెరు ఏరియా దవాఖాన పక్కన ఉన్న దాదాపు 5ఎకరాల రూరల్‌ హెల్త్‌ సెంటర్‌ స్థలంలో నిర్మించనున్నారు. దాదాపు రూ.250 కోట్లతో గ్రౌండ్‌ ఫ్లోర్‌తోపాటు సెల్లార్‌, ఐదంతస్తుల భారీ దవాఖానను నిర్మించనున్నారు. అన్ని విభాగాల స్పెషలిస్టు డాక్టర్లు, పరీక్షల విభాగం నిపుణులు ఇక్కడ వైద్య సేవలు అందజేస్తారు. పైగా ఉస్మానియా దవాఖాన ట్రైనీ విభాగం విద్యార్థులు, అధ్యాపకుల సేవలు ప్రజలకు అందుతాయి. వాటితోపాటు మల్టీస్పెషాలిటీ దవాఖాన సేవలు ప్రజలకు లభిస్తాయి. సర్జన్లు, శస్త్ర చికిత్సలూ ఇక్కడే చేస్తారు. హైదరాబాద్‌ మహానగరంలో ముంబై జాతీయ రహదారి పక్కన, రింగ్‌ రోడ్డు జంక్షన్‌కు కూతవేటు దూరంలో ఏర్పాటవుతున్న ఈ దవాఖానతో జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు లభిస్తాయి.

ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో..
ముందుగా 200 పడకల దవాఖానకు అంచనాలు వేసిన తర్వాత, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును సంప్రదించారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి కూడా దవాఖాన మంజూరుకు అనుమతులు అడిగారు. ఈ నేపథ్యంలో హరిత ట్రి బ్యునల్‌ పీసీబీ శాఖకు ఇచ్చిన సూచనల మేరకు వారి నిధులతోపాటు రాష్ట్ర సర్కారు నిధులు కూడా కలిపి దవాఖాన పడకల సామర్థ్యాన్ని పెంచేందుకు ఎమ్మెల్యే కోరారు. సీఎంతో మంత్రి హరీశ్‌రావు చర్చించారు. పారిశ్రామికవాడకు పెద్ద దవాఖానకు అనుమతులు సాధించారు.

ఏరియా దవాఖానతో సేవలు కొనసాగింపు..
ఇప్పటికే తెలంగాణ సర్కారు ఏరియా దవాఖానలో వైద్య సేవలను పెంచింది. దాని పక్కన రూ రల్‌ హెల్త్‌ సెంటర్‌ను పాత భవనంలో నిర్వహిస్తున్నారు. ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ దవాఖాన స్థలంలో మల్టీస్పెషాలిటీ దవాఖాన నిర్మిస్తారు. దాదాపు ఐదెకరాల స్థలంలో రూ.115 కోట్లతో భవనాన్ని నిర్మిస్తారు. నిర్మాణం అనంతరం 30 వేల స్కేర్‌ ఫీట్ల స్థలంలో రూరల్‌ హెల్త్‌ సెంటర్‌ కూడా ఇక్కడే కొనసాగుతుంది. మల్టీ స్పెషాలిటీ దవాఖానలో సీటీ స్కాన్‌, ఇతర ఆధునిక వైద్య యంత్రాలు, ఆధునిక ల్యాబ్‌లు, బెడ్స్‌, అంబులెన్స్‌లను రూ.25 కోట్లతో ఏర్పాటు చేస్తారు. పలు రకాల సేవలను అందుబాటులో తెచ్చేందుకు మౌలిక వసతులు కల్పిస్తారు. సిబ్బంది కోసం క్వార్టర్లు నిర్మిస్తున్నా రు. తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటుకు కార్యాచరణ కొనసాగుతున్నది. తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ ఇన్ఫ్రాస్టక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో హాస్పిటల్‌ పనులు జరుగుతాయి. ఇప్పటికే సంబంధిత శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూరల్‌ హెల్త్‌ సెంటర్‌ పాత భవనాన్ని తొలగించి ఆ స్థలాన్ని చదును చేస్తున్నారు. ఈ స్థలంలో భారీగా చెట్లుండడంతో అటవీశాఖ అనుమతులు రాగానే పనులు వేగవంతమవుతాయి.

కార్మికుల్లో ధీమా..
పటాన్‌చెరు పారిశ్రామికవాడలోని పటాన్‌చెరు, పాశమైలారం, కాజీపల్లి, గడ్డపోతారం, బొల్లారంతోపాటు పలు గ్రామాలు, మున్సిపాలిటీల్లోనూ పరిశ్రమలున్నాయి. కార్మికులు అధికంగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు జరుగడం, అనారోగ్యాలకు గురవడం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈఎస్‌ఐలున్నా, వాటి సేవలు కార్మికులందరికీ అందడం లేదు. పరిశ్రమల కాలుష్యం కారణంగా నష్టపోయిన గ్రామాల ప్రజలు కూడా తమకు మెరుగైన వైద్య సేవలు కావాలని కోరుతూ హరిత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. హరిత ట్రిబ్యునల్‌ పీసీబీ వద్ద ఉన్న నిధులతో ప్రజలకు ఉచిత వైద్య చికిత్సలు అందజేయాలని కోరింది. ఇటు కార్మికులతోపాటు అటు ప్రజలకు కూడా మెరుగైన వైద్యం అందజేయాలనే తపనతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ కోసం సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించారు. మంత్రి హరీశ్‌రావు చొరవతో ముఖ్యమంత్రి దవాఖానకు అనుమతులిచ్చారు. కాగా, దవాఖాన నిర్వహణలో భాగస్వామ్యం తీసుకునేందుకు పారిశ్రామికవేత్తలూ ముందుకొస్తున్నారని సమాచారం. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో పారిశ్రామికవాడలోని ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేసి ధన్యవాదాలు చెబుతున్నారు.

సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
మల్టీ స్పెషాలిటీ దవాఖాన మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు శిరస్సు వహించి ధన్యవాదాలు తెలుపుతున్నా. కార్మికులు, నిరుపేదలు అధికంగా ఉన్న పారిశ్రామిక ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ నిర్మించేందుకు సీఎం నిర్ణయించడం మాకు పండుగలా ఉంది. దీని కోసం కృషి చేసిన మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, మండలి ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో లభిస్తున్న సేవలు ఇక్కడ లభ్యమవుతాయి. కార్మికులు, పేద ప్రజల ఆరోగ్యాలకు భరోసా కల్పించే నిర్ణయమిది.

  • పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి

ఆరోగ్యానికి ధీమా..
దవాఖాన మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు. 270 పడుకల దవాఖానతో పేద ప్రజలు, కార్మికులకు కార్పొరేట్‌కు దీటుగా వైద్య సేవలందుతాయి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కృషి, మంత్రి హరీశ్‌రావు, ప్రొటెం చైర్మన్‌ భూపాల్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో దవాఖాన మంజూరైంది. నియోజకవర్గ ప్రజలకు ఇప్పుడు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి రానున్నది.

  • పటాన్‌చెరు కార్పొరేటర్‌ మెట్టు కుమార్‌యాదవ్‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana