e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జిల్లాలు అన్నదాతకు ఆపన్న హస్తం..

అన్నదాతకు ఆపన్న హస్తం..

ఆర్థిక భరోసా కల్పిస్తున్న రైతుబీమా పథకం
245 కుటుంబాలకు అందిన పరిహారం
రూ.5లక్షల చొప్పున రూ.12.25కోట్లు నామినీ అకౌంట్లల్లో జమ

ఇబ్రహీంపట్నంరూరల్‌, గష్టు 1 : అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను రుణమాఫీ ద్వారా విముక్తులను చేస్తున్నది. అప్పుల చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దనే ఉద్దేశంతో రైతుబందు పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నది. ప్రమాదవశాత్తు మృతిచెందితే ఆ రైతు కుటుంబం వీధి న పడకుండా రూ.ఐదులక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. 18-59సంవత్సరాల వయ స్సు కలిగిన రైతులకు రూపాయిఖర్చు లేకుండా ప్రభుత్వమే ఏటా రూ.3,275 ప్రభుత్వమే భరించి రైతులకు బీమా బాండ్లను అందజేస్తున్నది. గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మృతిచెందిన 245 మంది కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పున రూ.12.25కోట్ల బీమా డబ్బులు నామినీ ఖాతాల్లో జమ అయ్యాయి.

- Advertisement -

పథకం ప్రధాన ఉద్దేశం…
బతికినంత కాలం సమాజానికి అన్నం పెట్టే రైతన్నకు చనిపోయిన తరువాత సైతం అతని కుటుంబానికి బాసటగా నిలిచి, వారికి ఆర్థిక భరోసా కల్పించాలనే ప్రధాన ఉద్దేశంతో రైతు బీమా పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. గతంలో అనేక పథకాలు ప్రవేశపెట్టి నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆ పథకాల అమలు నామమాత్రంగానే ఉండేది. ఆ పథకం రైతు వరకూ చేరా లంటే పైరవీకారులు, మధ్య దళారుల ప్రమేయం లేనిదే అందేదికాదు. కాని, తెలంగాణ ప్రభుత్వం పాలన చేపట్టిన తరువాత వ్యవసాయరంగంలో అనేక మార్పులు చోటు చేసు కున్నాయి. సీఎం కేసీఆర్‌ స్వయంగా రైతు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయడమే కా కుండా అమలులో సైతం ప్రత్యేక చొరవ చూపెట్టడంతో సంక్షేమ పథకాలన్నీ రైతులకు పారదర్శకంగా అందుతున్నాయి. అయితే, ఏదేని కారణం చేత అన్నదాత మరణించినా ఆ రైతు కుటుంబం వీధిన పడకుండా ఉండేందుకు, సగర్వంగా సమాజంలో జీవించాలనే దూర దృష్టితో రైతుభీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. దీంతో చనిపోయిన రైతు కుటుంబాల సభ్యులు తిరిగి సాగు రంగంపై దృష్టి సారిచేందుకు సైతం పథకం దోహదం చేస్తున్నది.

పైసా ఖర్చులేదు…పైరవీలకు తావులేదు..
సీఎం కేసీఆర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబీమా విదివిధానాలు పకడ్బందీగా రూపొందించారు. మధ్య దళారులు ప్రమేయం లేకుండా, పైసా ఖర్చులేకుండా పరిహారం అదేవిధంగా ప్రణాళికలు చేశారు. గతంలో పట్టాదారు పాసుపుస్తకాలు అందుకున్న ప్రతీ రైతుకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. రైతు మరణించిన మరుక్షణమే సంబంధిత ఏఈఓ అతని ఇంటిని సందర్శించి పూర్తి వివరాలతో పాటు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో పొం దుపరుస్తున్నారు. దీంతో రైతు మరణించిన పది రోజులలోనే సంబంధిత నామినీ అకౌంట్లల్లో రూ.ఐదులక్షల పరిహారం వేస్తున్నారు.

ఎటువంటి మరణమైనా అర్హులే…
సాధారణంగా బీమా పథకాల్లో ఎక్కువశాతం ఏదేని రోడ్డు ప్రమాదం జరిగితేనే పరిహారం అందుతుంది. జీవితభీమా సంస్థలో సైతం ఎక్కువగా ఇలాంటి బీమా పథకాలు మాత్రమే ఉంటాయి. అయితే, రైతుబీమా పథకం మాత్రం ప్రమాదవశాత్తూ చనిపోయిన సాధారణం గా మరణించినా వర్తిస్తుంది. గతేడాది ఆగస్టు నుంచి నేటి వరకు దాదాపుగా రెండు వందలకు పైగా రైతులు మృతిచెందారు. వీరిలో మెజార్టీ రైతులు సహజంగా మరణించారు. రైతు చని పోయిన వెంటనే గ్రామ విస్తరణ అధికారికి సమాచారం చేరవేయాలి. అనంతరం రైతుకు సంబంధించిన నామినీ ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్‌, చనిపోయిన రైతు పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్‌లతో పాటు, గ్రామ పంచాయతీ కార్యదర్శి ధ్రువీకరించిన డెత్‌సర్టిఫికెట్‌ ఏఈవోకు ఇస్తే సరిపోతుంది.

సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోలేనిది
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఈ పథకం ద్వారా మా కుటుంబానికి రూ.ఐదులక్షల బీమా అందింది. నా భర్త పేరున గ్రామంలో ఎకరం పొలం ఉంది. ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందడంతో శోక సంద్రంలో ఉన్న మా కుటుంబానికి సీఎం కేసీఆర్‌ అండగా నిలిచారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేసిన బీమాతో మా కష్టాలు తీరాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాము.
-నాగిటి సుగుణమ్మ, తులేకలాన్‌

ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలి
నియోజకవర్గంలో కొంతమంది రైతులు రైతుబీమా చేయించు కోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. భూమి కలిగి ఉండి రైతు బీమా చేయించుకోని రైతులు తప్పనిసరిగా స్థానిక వ్యవసాయశాఖ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. ప్రమా దవ శాత్తు మృతిచెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఎంతో ఆదుకుంటున్నది. నయా పైసా ఖర్చులేకుండా నేరుగా అకౌంట్లల్లో పరిహారం జమ అవు తుండటం వల్ల రైతు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.

  • సత్యనారాయణ, ఏడీఏ, ఇబ్రహీంపట్నం
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana