e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021

అమ్మా బైలెల్లినాదో..

జిల్లాలో ఘనంగా బోనాల ఉత్సవాలు
నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌ ;రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో ఆదివారం బోనాలు ఘనంగా జరిగాయి. షాబాద్‌ మండలంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మం డలంలోని నరెడ్లగూడ, సర్దార్‌నగర్‌, పెద్దవేడు తదితర గ్రామాల్లో పోచమ్మ బోనాల ఉత్స వాల సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. సాయంత్రం మహిళలు బోనాల ఊరేగింపు చేపట్టారు. ఆషాఢమాసం సందర్భంగా గ్రామాల్లో బోనాల ఉత్సవా లను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆయా గ్రామాల్లోని గ్రామ దేవతలకు నైవైద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు, పోచారంతో పాటు ఆదిబట్ల, తుర్కయంజాల్‌, పెద్దఅంబర్‌పేట్‌, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో భక్తులు ఉదయం నుంచే కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అమ్మవారికి బోనాలను సమర్పించుకున్నారు. శంకర్‌పల్లి మున్సిపల్‌ పరిధిలోని పోచమ్మ దేవాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ సాత విజ యలక్ష్మి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని జనవాడ గ్రామంలో గండ్ల మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. మొయినాబాద్‌ మండల పరిధిలోని సురంగల్‌, మొయినాబాద్‌, చిలుకూరు, హిమాయత్‌నగర్‌, శ్రీరాంనగర్‌, వెంకటాపూర్‌, కనకమామిడి, అప్పోజిగూడ, దేవలవెంకటాపూర్‌, చిన్నమంగళా రం గ్రామాల్లో బోనాల పండుగా కన్నులపండువగా నిర్వహించారు. చిలుకూరు గ్రా మం లో మత్స్యకార సహకార సంఘం ఆధ్వర్యంలో తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. చేవెళ్ల పట్టణంతో పాటు మండల పరిధిలోని కుమ్మెర, కందవాడ, పామెన, న్యాలట, ఆలూర్‌, మిర్జాగూడ, తంగడిపల్లి, దేవుని ఎర్రవల్లి, మిర్జాగూడ గ్రామాల్లో వైభవంగా బోనాల పం డుగ చేసుకున్నారు. ఉదయం నుంచి పోచమ్మ, దుర్గమ్మ తల్లికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బోనాల ఊరే గింపు ముందు పోతురాజుల విన్యాసాలు, డోలు, డప్పు దర్వులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీ పరిధి గ్రామాలు తుర్కయాంజాల్‌, కమ్మగూడ, ఇంజాపూర్‌లో బోనాలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని పోచమ్మ, మైసమ్మ, మారమ్మ, కట్ట మైసమ్మ, నల్ల పోచమ్మ, మహం కాళమ్మ, ఎల్లమ్మ, బీరప్ప దేవాలయాల్లో బోనాలను ఘనంగా నిర్వహించారు. నందిగామ మండల కేంద్రంలో ఆదివారం మైసమ్మ, పోచమ్మ తల్లి బోనాలను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుల్లతో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో మహి ళలు, యువతులు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు నైవేద్యాన్ని సమ ర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పెద్దఅంబర్‌పేట మున్సిపాల్టీలోని పలు వార్డులలో బోనాల పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana