e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 14, 2021
Home జిల్లాలు నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

నేరడిగొండ, జూన్‌ 1: రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని నేరడిగొండ ఎస్‌ఐ భరత్‌సుమన్‌, ఎంఏవో భాస్కర్‌ హెచ్చరించారు. జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని విత్తనాల దుకాణాల్లో వ్యవసాయ, పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ‘విత్తన టాస్క్‌ఫోర్స్‌’ మంగళవారం తనిఖీలు చేశారు. దుకాణాల్లో విత్తన నిల్వలు, వాటి నాణ్యతను పరిశీలించారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేటప్పుడు రసీదు తీసుకోవాలని రైతులకు సూచించారు. వ్యవసాయశాఖ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు.
దుకాణాల్లో తనిఖీ
బజార్‌హత్నూర్‌, జూన్‌ 1: మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ సీడ్స్‌ దుకాణాల్లో ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌, వ్యవసాయాధికారి ప్రమోద్‌రెడ్డి తనిఖీ చేశారు. స్టాక్‌రిజిస్టర్లు పరిశీలించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మిన వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని సూచించారు. వారి వెంట ఏఈవోలు భోజన్న, రాము, కృష్ణపాల్‌ ఉన్నారు.
నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దు
బేల, జూన్‌ 1: రైతులు నకిలీ విత్తనాలు కొని మోసపోవద్దని లైసెన్స్‌ కలిగిన డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని మండల వ్యవసాయాధికారి విశ్వామిత్ర సూచించారు. మండలంలోని సాంగిడి, డోప్టాల, చప్రాల, బెదోడ గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన పంటలు సాగు చేయాలని సూచించారు. ఎక్కువ మోతాదులో ఎరువుల వాడకం తగ్గించాలన్నారు. గ్రామాల్లో లైసెన్స్‌ లేకుండా విత్తనాలు, ఎరువులు అమ్మినట్లయితే తమకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈవోలు రాజు, రమణ, కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్‌ రూరల్‌, జూన్‌ 1: పట్టణంలోని ఎరువుల దుకాణంలో ఇన్‌చార్జి ఏడీఏ ఆసం రవికుమార్‌, సీఐ శ్రీధర్‌గౌడ్‌ తనిఖీలు చేశారు. స్టాక్‌ రికార్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని యజమానికి సూచించారు. ప్రకటన బోర్డులు దుకాణాల ముందు ఏర్పాటు చేయాలని అన్నారు. నకిలీ విత్తనాల గురించి ఎటువంటి సమాచారం తెలిసిన పోలీసులు, సంబంధిత వ్యవసాయ కార్యాలయానికి 7288894049, డయల్‌ 100కు అందించాలని సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

ట్రెండింగ్‌

Advertisement