e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home కొమరంభీం రైతు సేవాకేంద్రాల్లో రాయితీపై ఎరువులు

రైతు సేవాకేంద్రాల్లో రాయితీపై ఎరువులు

రైతు సేవాకేంద్రాల్లో రాయితీపై ఎరువులు

ఆసిఫాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి
జైనూర్‌, లింగాపూర్‌ మండల కేంద్రాల్లో సెంటర్ల ప్రారంభం

జైనూర్‌, జూన్‌ 1: రైతులకు రాయితీపై ఎరువులు అందించేందుకే ప్రభుత్వం ఆగ్రోస్‌ రైతుసేవా కేంద్రాలను మంజూరు చేస్తున్నదని జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి అన్నారు. మండలకేంద్రంలో ఏఆర్‌ఎస్‌కేను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్‌ కంటే ఆగ్రోస్‌ కేంద్రాల్లో రాయితీపై ఎరువులు అందుతాయని, దీంతో రైతులకు ఆర్థిక ఇబ్బందులు తప్పుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవరావ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆత్రం భగవంత్‌రావ్‌, సహకార సంఘం చైర్మన్‌ కోడప హన్నూపటేల్‌, సర్పంచ్‌ పార్వతీ లక్ష్మణ్‌, నాయకులు అజ్జులాల, నిర్వాహకులు జాహేద్‌ఖాన్‌, కేంద్రె శివాజీ, గెడాం లక్ష్మణ్‌, పోలిపల్లి నరేందర్‌ తదితరులున్నారు.
మండలకేంద్రంలో..
లింగాపూర్‌, జూన్‌ 1: మండలకేంద్రంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కోవలక్ష్మి ఆగ్రోస్‌ రైతు సేవాకేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అమాయక ఆదివాసీ గిరిజన రైతులకు నకిలీ విత్తనాలు, పురుగు మందులను అంటగడుతారని, ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని మం డల అధికారులను ఆదేశించారు. అనంతరం మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ సంగీత జడ్పీ చైర్‌పర్సన్‌కు శాలువా కప్పి సన్మానించా రు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కనక యాదవరావ్‌, జిల్లా ఏడీ రవి, ఎంపీడీవో ప్రసాద్‌, వ్యవసాయ అధికారి రామకృష్ణ, ఎస్‌ఐ మధుకర్‌, ఎంపీపీ ఆడే సవిత, జడ్సీటీసీ రక్కాబాయి, నాయకులు రవీందర్‌, రాజేశ్‌, సత్యపాల్‌, రాజశేఖర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతు సేవాకేంద్రాల్లో రాయితీపై ఎరువులు

ట్రెండింగ్‌

Advertisement