e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జిల్లాలు బాల శాస్త్రవేత్తలు.. భళా

బాల శాస్త్రవేత్తలు.. భళా

బాల శాస్త్రవేత్తలు.. భళా

రామగిరి, మార్చి15 : విద్యార్థుల్లోని విజ్ఞానాన్ని వెలికి తీసేందుకు నిర్వహించిన 48వ జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ సైన్స్‌, గణిత, పర్యావరణ ప్రాజెక్టుల జిల్లాస్థాయి సైన్స్‌ ప్రదర్శనలో పలువురు బాల శాస్త్రవేత్తలు ప్రతిభ చాటారు. కొవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన ప్రదర్శనకు 83 ప్రాజెక్టులు నమోదు కాగా ఆరు ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు డీఈఓ భిక్షపతి తెలిపారు. సోమవారం ప్రదర్శన ఫలితాలను ఆయన విడుదల చేశారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులను ఆయన అభినందించారు. రాష్ట్రస్థాయి ఆన్‌లైన్‌ ప్రదర్శన వివరాల కోసం జిల్లా సైన్స్‌ అధికారి వనం లక్ష్మీపతిని, లేదా సెల్‌ 98485 78845కు సంప్రదించాలని సూచించారు. 

రాష్ట్రస్థాయికి ఎంపికైన ప్రదర్శనలు

  • పర్యావరణ హితం అనే అంశంపై నల్లగొండలోని సాందీప్‌ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి  పి.సందీప్‌ ఇచ్చిన ప్రదర్శన ఉత్తమంగా ఎంపికైంది. ‘బెనిఫిట్స్‌ ఫ్రమ్‌ నేచర్‌’ పేరుతో  ప్రకృతి, పర్యావరణ రక్షణ అంశాలపై అతను ప్రాజెక్టు రూపొందించాడు.  
  • చారిత్రక అభివృద్ధి అనే అంశంపై గుండ్లపల్లి మండలం కందుకూరు జడ్పీహైస్కూల్‌ 9వ తరగతి విద్యార్థి ఎన్‌.శంకర్‌ కలుపు మొక్కలను సులభంగా తొలగించే వ్యవసాయ పరికరాన్ని తయారు చేశాడు. దీని సాయంతో రైతుకు ఖర్చు, శ్రమ తగ్గుతుంది.  
  • ఆరోగ్యం-పరిశుభ్రత అనే అంశంపై ప్రభుత్వ ఉన్నత పాఠశాల మిర్యాలగూడకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎం.రిషీ రూపొందించిన ‘హిమో డయాలసిస్‌’ యంత్రం ఉత్తమంగా ఎంపికైంది.  
  • ఇంటరాక్టివ్‌ సాఫ్ట్‌వేర్‌ అంశంపై కనగల్‌ మండలం చిన్నమాదారం జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థిని జి.సింధు ‘ఆటోమేటిక్‌ బైక్‌ ఇండికేటర్‌’ను రూపొందించింది. ఈ యంత్రాన్ని బైక్‌కు బిగించడం వల్ల బైక్‌ ఏ వైపునకు తిరిగితే ఆ వైపున ఉన్న ఇండికేటర్‌ ఆన్‌ అవుతుంది. దీని వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. 
  • గణిత మోడలింగ్‌ అంశంపై మునుగోడు మండలం గూడపూర్‌ ఎంపీయూపీఎస్‌ 7వ తరగతి విద్యార్థి  డి.శివప్రసాద్‌ ‘జిమోమాట్రిక్‌ షేప్స్‌’ రూపొందించాడు. గణితంలోని పలు అంశాలను ఈ మోడల్స్‌ ద్వారా సులభంగా వివరించవచ్చు.
  •  ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, నల్లగొండకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఎస్‌కె. బషీరా రూపొందించిన ‘హైడ్రాలిక్‌ లిఫ్టింగ్‌ వీల్‌ చైర్‌’ ఇతర విభాగాల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైంది. 
  • సైన్స్‌ సెమినార్‌ విభాగంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని ఎం.శ్రీవాణి ఎంపికైంది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బాల శాస్త్రవేత్తలు.. భళా

ట్రెండింగ్‌

Advertisement