e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home జిల్లాలు బడి బాటలో బాలలు

బడి బాటలో బాలలు

 

బడి బాటలో బాలలు

మిర్యాలగూడ రూరల్‌, మార్చి 15:  సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం గాడిన పడుతున్నది. కొవిడ్‌ నేపథ్యంలో పాఠశాలలు మూతబడగా, కొన్ని నెలలుగా ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 1 నుంచి 9,10 తరగతులకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. మొదట్లో ఆసక్తి చూపని విద్యార్థులు క్రమంగా పెరుగుతున్నారు. 6-8 తరగతులు  ఫిబ్రవరి 24న ప్రారంభం  రోజు 4 శాతం మంది విద్యార్థ్దులు హాజరయ్యారు. ఉపాధ్యాయులు విద్యార్థ్దులను బడికి రప్పించేందుకు తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నా లు చేయగా, అవి క్రమంగా ఫలిస్తున్నాయి. గత నెలాఖరుకు 30 శాతం లోపు ఉన్న విద్యార్థుల హాజరుశాతం   ప్రస్తుతం 60 శాతానికి పెరిగింది. మండలంలో 77 పాఠశాలలు ఉండగా ఇందులో నమోదైన విద్యార్థ్దులు 12,489 మంది కాగా తల్లిదండ్రులు తమ పిల్లలను పంపిస్తామని 8,307 మంది అంగీకార పత్రం ఇవ్వగా అందులో 7,821 మంది విద్యార్థ్దులు  హాజరవుతున్నారు. 

గురుకులాల్లో 50 శాతం హాజరు 

- Advertisement -

మండలంలో అవంతీపురం గిరిజన బాలుర గురుకుల పాఠశాలతో పాటు మరో ఆరు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2,883 మంది విద్యార్థులు ఎన్‌రోల్‌ కాగా ప్రస్తుతం 1460 మంది  హాజరవుతున్నారు. కాగా 9,10 తరగతుల్లో వంద శాతం హాజరు కావడం గమనార్హం  6,7,8 తరగతుల హాజరు పెరగాల్సి ఉంది. 

మోడల్‌ స్కూల్‌లో..

మండలంలోని శ్రీనివాస్‌నగర్‌ మోడల్‌ స్కూల్‌లో 572 మంది విద్యార్థులు నమోదుకాగా 385 మంది విద్యార్థ్దుల తల్లిదండ్రులు పంపిస్తామని లిఖిత పూర్వక హామీ ఇచ్చారు. అందులో 383 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరవుతున్నారు. 

కేజీబీవీలో అతి తక్కువ హాజరు 

ఆలగడప గ్రామ శివారులో ఉన్న కస్తూర్బా పాఠశాలకు తక్కువ మంది విద్యార్థులు హాజరవుతున్నారు. 188 మంది విద్యార్థ్దులు ఎన్‌రోల్‌ చేసుకున్నారు. వీరిలో 102 మంది తల్లిదండ్రులు హామీ పత్రం ఇచ్చినప్పటికీ అందులో 98 మంది మాత్రమే హాజరవుతున్నారు. హాస్టల్‌కు పంపించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. 

 జడ్పీ ఉన్నత పాఠశాలల్లో.. 

మండలంలో 15 జడ్పీ ఉన్నత, ఒకఎయిడెడ్‌   పాఠశాల ఉన్నాయి. అందులో 2,960 మంది నమోదు చేసుకోగా 1,368 మంది విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను పంపుతామని హామీ పత్రాలు ఇచ్చారు. ఇందులో 1,456 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బడి బాటలో బాలలు
బడి బాటలో బాలలు
బడి బాటలో బాలలు

ట్రెండింగ్‌

Advertisement