e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

కరోనా కట్టడికి సమన్వయంతో పనిచేయాలి
నేటి నుంచి కాకతీయ సూపర్‌స్పెషాలిటీ దవాఖానలో సేవలు
అవసరమైతే పూర్తిస్థాయి కొవిడ్‌ దవాఖానగా ఎంజీఎం
రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు
‘రెమ్‌డెసివిర్‌’ను అందుబాటులో ఉంచాలి : మంత్రి సత్యవతి
ఉమ్మడి జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌
కేఎంసీలో వసతులను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

అధిక ఫీజులతో ఇబ్బంది పెట్టొద్దని ప్రైవేట్‌ హాస్పిటల్‌ యాజమాన్యాలకు హెచ్చరిక
వరంగల్‌రూరల్‌, ఏప్రిల్‌ 29 (నమస్తేతెలంగాణ): ప్రజారోగ్యానికే తొలి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని, కరోనాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌ నుంచి ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంతకుముందు నగరంలోని పేదలకు సాధారణ వైద్య సేవలందించేందుకు ప్రస్తుతం 50 పడకల సామర్థ్యంతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ను శుక్రవారం ప్రారంభిస్తామని తెలిపారు. వారంలోగా దాన్ని 250 పడకలకు పెంచి, అవసరమైతే ఎంజీఎంను పూర్తిస్థాయి కొవిడ్‌ దవాఖానగా మారుస్తామని చెప్పారు.

ప్రజారోగ్యమే ప్రభుత్వ లక్ష్యమని, కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అధికారులకు సూచించారు. గురువారం వారు నర్సంపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి వరంగల్‌ రూరల్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి వరంగల్‌ అర్బన్‌, రూరల్‌, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లి, జనగామ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. మం త్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ప్రైవేట్‌ దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి కూడా ఆక్సిజన్‌ కొరత లేకుండా సరఫరా చేసే అవకాశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు.

దవాఖానల్లో ఏది కొరత ఉన్నా రాతపూర్వకంగా తమ దృష్టికి తెస్తే, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులతో మాట్లాడి అందుబాటులోకి తెస్తామన్నారు. ఐసొలేషన్‌ కేంద్రాలను ఎక్కువగా పెట్టాలని, ప్రతి మండల కేంద్రంలో అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేసి ఆశ వర్కర్లు, అంగన్‌వాడీలతో బాధితులకు భరోసా కల్పించాలని ఎర్రబెల్లి చెప్పా రు. డ్వాక్రా సంఘాలతో మాస్కులు తయారు చేయించి అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని, హెల్ప్‌లైన్‌ కేంద్రాలను ఎక్కువగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్‌లోని ఎంజీఎం దవాఖానలో ఆక్సిజన్‌ ఇబ్బంది లేదని, ఇక్కడ ఎక్కువ రోగులు చనిపోతున్నారని తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. జనరల్‌ రోగులను కేఎంసీకి పంపే ప్రయత్నం చేస్తున్నామని, శుక్రవారం నుంచి ఇది ప్రారంభమవుతుందని తెలిపారు. డాక్టర్లు సెలవులు లేకుండా పనిచేయాలని, పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవాలని కోరారు. మాస్కులు లేకపోతే ఫైన్‌ వేయడాన్ని కచ్చితంగా అమలు చేయాలని, జనం గుంపులు గుంపులుగా తిరుగకుండా కట్టడి చేయాలని అధికారులకు సూచించారు.

అడిగినవారందరికీ టెస్టులు
మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ.. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌పై ప్రజలకు బాగా నమ్మకం పెరిగినందున కావల్సినన్ని అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అడిగిన వారందరికీ కరోనా టెస్టులు చేయాలన్నారు. వెంటిలేటర్ల అవసరంపై ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తేవాలని మంత్రి చెప్పారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ అందుబాటులో ఉండేలా ప్రయత్నం చేస్తామని, మే 3 తర్వాత మళ్లీ సమీక్షిస్తామని సత్యవతి అన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ..నర్సంపేట ఏరియా ద వాఖానలో కరోనా రోగులకు అసౌకర్యాలు కలుగకుం డా ఏర్పాట్లు చేయాలన్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ హరిత, మహబూబాబాద్‌, జనగామ, జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లాల కలెక్టర్లు, పోలీసు, వైద్యఆరోగ్య, ఇత ర శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

వ్యాక్సినేషన్‌లో తెలంగాణ ఆదర్శం
హన్మకొండ, ఏప్రిల్‌ 29 : కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం ఉద యం ఆయన హన్మకొండ పోచమ్మకుంటలోని అర్బన్‌హెల్త్‌సెంటర్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మే ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలపైబడిన వారందరికీ ఉచితం గా వ్యాక్సిన్‌ ఇవ్వనన్నుట్లు తెలిపారు. అర్బన్‌ జిల్లాలో 1,82,507 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు తెలిపారు.

నేటి నుంచి సూపర్‌స్పెషాలిటీ దవాఖానలో సేవలు
పేదల వైద్యానికి ఎలాంటి ఆటంకాలు రానీయమని, కాకతీయ మెడికల్‌ కళాశాల ఆవరణలోని సూపర్‌స్పెషాలిటీ దవాఖానలో సాధారణ వైద్యసేవలందించేందుకు ఏర్పా ట్లు చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. గురువారం ఆయన దవాఖానను సందర్శించి మౌలిక వసతులను పరిశీలించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి కరోనా బాధితులు వస్తుండడంతో రోజురో జుకూ ఎంజీఎం దవాఖానలో వారి సంఖ్య పెరుగుతున్నదన్నారు. పేదల ప్రజలకు సాధారణ వైద్య సేవలందించేందుకు 50 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను శుక్రవారం ప్రారంభించనున్నట్లు తెలిపారు. వారం రోజుల్లో దానిని 250 పడకలకు పెంచుతామన్నారు. అవసరాన్ని బట్టి వరంగల్‌ ఎంజీఎం దవాఖానను పూర్తి కొవిడ్‌ హాస్పిటల్‌గా మార్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకాలు చేపడుతామన్నారు. ఎక్క డా నిర్లక్ష్యానికి తావివ్వకుండా, ప్రతిపేద వాడికి ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందిస్తామన్నా రు. ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెం ట్‌ డాక్టర్‌ నాగార్జునరెడ్డి, కేఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సం ధ్య, నోడల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రజల ఆరోగ్యమే ముఖ్యం

ట్రెండింగ్‌

Advertisement