e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home జిల్లాలు నిరాడంబరం..గులాబీ వేడుక

నిరాడంబరం..గులాబీ వేడుక

నిరాడంబరం..గులాబీ వేడుక

ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ వేడుకలు
కేసీఆర్‌ భవన్‌లో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్సీ నారదాసు
గ్రామగ్రామాన స్వీట్లు, పండ్లు పంపిణీ చేసిన నాయకులు
పలు చోట్ల సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం

సిరిసిల్ల టౌన్‌, ఏప్రిల్‌ 27: కరోనా వ్యాప్తి నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ 20వ ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి జిల్లాలో నిరాడంబరంగా జరిగాయి. పార్టీ శ్రేణులు కొవిడ్‌-19 నిబంధనలకు లోబడి నిర్వహించాయి. కరీంనగర్‌ శివారులోని తీగలగుట్టపల్లిలో గల కేసీఆర్‌ భవన్‌, మంత్రి గంగుల కమలాకర్‌ మీసేవా కార్యాలయం వద్ద ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయా చోట్ల పార్టీ నాయకులు జెండాలు ఆవిష్కరించి, సంబురాలు చేసుకున్నారు.ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి 20వ ఆవిర్భావ వేడుకలు సాదాసీదాగా జరిగాయి. కొవిడ్‌ విజృంభిస్తున్న దృష్ట్యా పార్టీ నాయకులు వేడుకలను నిరాడంబరంగా జరిపారు. గ్రామాగ్రామాన గులాబీ జెండాను ఎగరేశారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు. పలు చోట్ల సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో అసువులు బాసిన అమరవీరులకు నివాళులర్పించారు.

“సీఎం కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యం.. టీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇంటింటికీ సంక్షేమ పథకాలు” అందుతున్నాయని టీఆర్‌ఎస్‌ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాలు మంగళవారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. గాంధీ చౌరస్తాలో పార్టీ జెండాను పట్టణాధ్యక్షుడు చక్రపాణి ఆవిష్కరించి, మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ 20 వసంతాలు ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నదని కొనియాడారు. దేశానికే ఆదర్శంగా రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని కొనియాడారు. ఇక్కడ రాష్ట్ర సహాయకార్యదర్శి గూడూరి ప్రవీణ్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి మ్యాన రవి, గ్రంథాలయ జిల్లా చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, ఆర్‌బీఎస్‌ జిల్లా కన్వీనర్‌ గడ్డం నర్సయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, అర్బన్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ దార్నం లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు, నాయకులు దిడ్డి రాజు, గుండ్లపల్లి పూర్ణచందర్‌, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గంభీరావుపేట, ఏప్రిల్‌ 27: మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ వంగ కరుణ, జడ్పీటీసీ కొమిరిశెట్టి విజ య, పట్టణాధ్యక్షుడు గంద్యాడపు రాజు, వైస్‌ ఎంపీపీ దోస ల లత, నేతలు వంగ సురేందర్‌రెడ్డి, కొమిరిశెట్టి లక్ష్మణ్‌, రెడ్డిమల్ల రాజనర్సు, మహబూబ్‌అలీ, గౌరినేని నారాయణరావు, లింగంయాదవ్‌, దేవేందర్‌, పాపాగారి శ్రీనివాస్‌గౌడ్‌, నారాయణ, బాలకిషన్‌రావు, బాల్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్‌ 27: మండల కేంద్రంలోని తన ఇంటిపై టీఆర్‌ఎస్‌ జిల్లా ఇన్‌చార్జి తోట ఆగయ్య పార్టీ జెం డాను ఎగురవేశారు. పలు గ్రామాల్లో పార్టీ అధ్యక్షులతోపా టు కార్యకర్తలు జెండాను ఎగరేశారు. మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, ఏఎంసీ చైర్మన్‌ కొండ రమేశ్‌గౌడ్‌, పట్టణాధ్యక్షుడు నేవూరి వెంకటనర్సింహారెడ్డి, ఎంపీపీ పిల్లి రేణుక, వైఎస్‌ ఎంపీపీ కదిరె భాస్కర్‌గౌడ్‌, నాయకులు నేవూరి వెంకట్‌రెడ్డి, నర్సింలు, శివరామకృష్ణ పాల్గొన్నారు.

సిరిసిల్ల రూరల్‌, ఏప్రిల్‌ 27: తంగళ్లపల్లి మండల వ్యాప్తంగా నిర్వహించిన వేడుకల్లో ఎంపీపీ పడిగెల మాన స, మండలాధ్యక్షుడు గజభీంకార్‌ రాజన్న, ఏఎంసీ, ఏఏసీఎస్‌ చైర్మన్లు సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, బండి దేవదాస్‌, వైస్‌ చైర్మన్‌ వెంకటరమణారెడ్డి, సర్పంచుల ఫోరం జిల్లా, మండలాధ్యక్షులు మాట్ల మధు, వేణుగోపాలరావు, మాజీ ఎంపీ పీ సరస్వతి, సర్పంచ్‌ జక్కుల రవీందర్‌, వైస్‌ ఎంపీపీ జం గిటి అంజయ్య, పడిగెల రాజు, అంకారపు రవీందర్‌, పెద్దూరి తిరుపతి, మదన్‌రెడ్డి, ఎండీ హమీద్‌, సురభి నవీన్‌రావు, నులుగొండ శ్రీనివాస్‌, కందుకూరి రామాగౌడ్‌, బుస్స లింగం, గనప శివజ్యోతి, టీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర నేత జక్కుల నాగరాజు, ముత్యంరెడ్డి, గోపాల్‌రెడ్డి, భీమ చం ద్రం, మీస రాములు ఉన్నారు.

మున్సిపల్‌ పరిధిలో..
మున్సిపల్‌ పరిధిలో నిర్వహించిన వేడుకల్లో మేడుదుల దేవయ్య, ఏఎంసీ మాజీ డైరెక్టర్‌ బండారి శ్యాం, కౌన్సిలర్లు లింగంపల్లి సత్యనారాయణ, ఒగ్గు ఉమ, పాతూరి రాజిరెడ్డి, పోచవేని సత్య, కల్లూరి లత, బుర్ర లక్ష్మి, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ అగ్గి రాములు, ఎరవెల్లి వెంకటరమణారావు, గండ్ర రమేశ్‌రావు, విడుగురాళ్ల బాలరాజు, మేడుదుల దేవయ్య, రమేశ్‌, వెంకట్రావు, వీరగోని శ్రీనివాస్‌గౌడ్‌, అలువాల ఈశ్వర్‌, పసునూరి శ్రీనివాస్‌, వేముల వేణు, అనిల్‌, జీల కిషన్‌, లడ్డూబాయి, బాలరాజు ఉన్నారు.
ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 27: మండలంలో నిర్వహించిన వేడుకల్లో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గొడుగు తిరుపతి, గ్రామశాఖల అధ్యక్షులు, బాలరాజు, సాదుల్‌, రఘు, సావనపెల్లి రాకేశ్‌, సలీం, మామిడి సంజీవ్‌, భాస్కర్‌, రమేశ్‌ సింగ్‌, భాస్కర్‌, అనిల్‌, ప్రభాకర్‌ వెంకన్న ఉన్నారు.

వీర్నపల్లి, ఏప్రిల్‌ 27: మండలలో నిర్వహించిన వేడుకల్లో పార్టీ మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, పార్టీ మహిళా విభా గం మండలాధ్యక్షురాలు గుగులోత్‌ కళ, నాయకులు మల్లే శం, పృథ్వీరాజ్‌, అజయ్‌, ప్రవీణ్‌ ఉన్నారు.

ముస్తాబాద్‌, ఏప్రిల్‌ 27: మండలాధ్యక్షుడు భూంపెల్లి సురేందర్‌రావు, ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఆర్‌బీఎస్‌ కన్వీనర్‌ కల్వకుంట్ల గోపాల్‌రావు, ఏఎంసీ చైర్‌పర్సన్‌ శీలం జానాబాయి, సర్పంచులు, ఎంపీటీసీలు జెండాను ఆవిష్కరించారు.

వేములవాడ, ఏప్రిల్‌27: తెలంగాణ చౌక్‌లో టీఆర్‌ఎస్‌ జెండాను పట్టణాధ్యక్షుడు పుల్కం రాజు ఆవిష్కరించారు. ఇక్కడ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, వైస్‌ చైర్మన్‌ మధు రాజేందర్‌, కౌన్సిలర్‌ యాచనేని శ్రీనివాస్‌రావు, గోలి మహేశ్‌, ఏఎంసీ డైరెక్టర్‌ కమలాకర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు రామతీర్థపు రాజు, పిట్టల వెంకటేశ్‌, దేవరాజు, పెంట రామకృష్ణ ఉన్నారు.

వేములవాడ రూరల్‌, ఏప్రిల్‌ 27: వేములవాడ, వేములవాడ రూరల్‌ మండలాల్లో నిర్వహించిన వేడుకల్లో ఏఎం సీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గడ్డం హన్మాండ్లు, జడ్పీటీసీ మ్యాకల రవి, గ్రామశాఖ అధ్యక్షుడు సందనాల శ్రీనివాస్‌ జెండాను ఆవిష్కరించారు. ఆరెపల్లిలో నిరుపేద కుటుంబానికి 25కిలోల బియ్యం అందజేశారు. ఇక్కడ సర్పంచ్‌ వేణుగోపాల్‌, ఎంపీటీసీ దేవరాజు, నాయకులు చిలువేరి మల్లేశం, గుండెకార్ల నరేశ్‌, ఇటిక్యాల రాజు, రంగు రాజుములు, భాస్కర్‌, బాబు, రాములు, సత్యం, శ్రీనివాస్‌, హరీశ్‌, వేణు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిరాడంబరం..గులాబీ వేడుక

ట్రెండింగ్‌

Advertisement