e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, July 29, 2021
Home జిల్లాలు ఢిల్లీ మెడలు వంచుతాం

ఢిల్లీ మెడలు వంచుతాం

ఢిల్లీ మెడలు వంచుతాం

కొట్లాడి కోచ్‌ ఫ్యాక్టరీ సాధిస్తాం
బీజేపీ నేతలు దద్దమ్మలు
టీఆర్‌ఎస్‌ పాలనలోనే నగరాభివృద్ధి
బీజేపీ చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మొద్దు
విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
పలు డివిజన్లలో ఎన్నికల ప్రచారం

వరంగల్‌/ఖిలా వరంగల్‌/మట్టెవాడ/కరీమాబాద్‌, ఏప్రిల్‌ 27 : రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై కక్షగట్టి కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వడం లేదని, టీఆర్‌ఎస్‌ పక్షాన కేంద్రంతో కొట్లాడి ఫ్యాక్టరీని సాధిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంగళవారం ఆయన వరంగల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాజీపేటలో రైల్వే పరిశ్రమ కోసం 150 ఎకరాలను రైల్వే శాఖకు అప్పగించినా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మామునూరులో ఎయిర్‌పోర్ట్‌ కోసం 600 ఎకరాలు సేకరించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ అధికారులు వచ్చి పరిశీలించారని, ఆయినా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణకు 15 మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాస్తే ఒక్కటి కూడా మంజూరు చేయలేదన్నారు. కనీసం తాము ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్‌, కరీంనగర్‌కు కూడా మెడికల్‌ కాలేజీలు తెచ్చుకోలేని దద్దమ్మలు బీజేపీ నేతలని ఎద్దేవా చేశారు. వరంగల్‌ నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చే స్తుంటే బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.

రూ.4,126 కోట్లతో వివిధ పథకాల ద్వారా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఝూటా పార్టీ మాటలను వరంగల్‌ ప్రజలు నమ్మొద్దని కోరారు. నగరాభివృద్ధికి వందల కోట్ల నిధులను రాష్ట్ర సర్కారు విడుదల చేస్తున్నదని చెప్పారు. నగర ప్రజలకు కనీస వసతులు కల్పించేందుకు సీఎం కేసీఆర్‌, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, రూ.39కోట్లతో మోడల్‌ మార్కెట్లు నిర్మిస్తున్నామని, మరో ఆరు మార్కెట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వివరించారు. నగరంలో ఇండ్లు లేని పేదల కోసం రూ.115కోట్లతో 4,417 డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు కట్టిస్తున్నామని, త్వరలోనే వాటిని లబ్ధిదారులకు అందిస్తామని చెప్పారు. నగరాభివృద్ధికి పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌ను గ్రేటర్‌ ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్‌ మాట్లాడుతూ గిరిజన యూనివర్సిటీకి 350 ఎకరాల భూమి సేకరించి మూడేళ్ల క్రితమే కేంద్రానికి అప్పగించినా ఇప్పటి వరకు మంజూరు చేయలేదని చెప్పారు. తాత్కాలికంగా తరగతులు ప్రారంభించాలని జాకారంలో భవనం ఏర్పాటు చేసినా యూనివర్సిటీని మాత్రం ఇవ్వలేదని విమర్శించారు. ఒక్క ఎకరం భూమి కూడా ఇవ్వని ఆంధ్రప్రదేశ్‌కు గిరిజన యూనివర్సిటీని మంజూరు చేసిందన్నారు కేంద్రం తెలంగాణపై కక్ష సాధింపు చర్యలకు ఇది నిదర్శనం కాదా అని ప్రశ్నించారు.

- Advertisement -

వరంగల్‌ నగరాభివృద్ధికి వందల కోట్ల నిధులు మంజూరు చేసిన టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించే నైతికత బీజేపీ నేతలకు లేదన్నారు. మరో ఆరు నెలల్లో అభివృద్ధి ఫలాలు నగర ప్రజలకు అందుతాయని చెప్పారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటన్నారు. దేశానికి పట్టిన పీడ బీజేపీ అన్నారు. తెలంగాణకు నిధులివ్వకుండా అన్యాయం చేస్తున్నదని విమర్శించా రు. రాష్ట్రం పన్నుల రూపంలో కేంద్రానికి చెల్లించిన దానిలో 60 శాతం నిధులు రాష్ర్టానికి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌, వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యుడు పసునూరి దయాకర్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, మహబూబాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ అంగోతు బిందు పాల్గొన్నారు.

కొట్లాడి కోచ్‌ ఫ్యాక్టరీ సాధిస్తాం
ఖిలావరంగల్‌ కోటలో 37వ డివిజన్‌ అభ్యర్థి వేల్పుగొండ సువర్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విజ్ఞప్తి చేశారు. తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి మంత్రి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి ఓటేస్తే మురుగుకాల్వలో వేసినట్లేనని, వరంగల్‌ అభివృద్ధి టీఆర్‌ఎస్‌ వల్లే సాధ్యమన్నారు. లక్ష్మీ టాకీస్‌ ప్రాంతంలో జరిగిన ప్ర చారంలో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వచ్చి కల్లబొల్లి మాటలు చెప్పేవారిని నమ్మొద్దన్నారు. నగర ప్రజల కు నిత్యం తాగునీరు అందిస్తూ, డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగు పరుస్తూ, ముంపు ప్రాంతాల బాధలను తీర్చుతున్న ఘనత టీఆర్‌ఎస్‌ పార్టీదేనన్నారు.

వరదలు వచ్చిన సమయంలో ఏ ఒక్కరూ వచ్చి పలకరించలేదని, ఇప్పుడు ఓట్లు అడిగేందుకు లైన్‌ కట్టి వస్తున్నారని ఎద్దేవా చేశారు. 24, 28వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో పాటు 25వ డివిజన్‌ నుంచి పోటీ చేస్తున్న బస్వరాజు శిరీషను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. ఇక్కడ నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఇన్‌చార్జి పెద్ది స్వప్న పాల్గొన్నారు. 42వ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేడల పద్మను గెలిపించాలని మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి ప్రచారం చే శారు. రంగశాయిపేటను అన్ని విధా లా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తించి టీఆర్‌ఎస్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఢిల్లీ మెడలు వంచుతాం
ఢిల్లీ మెడలు వంచుతాం
ఢిల్లీ మెడలు వంచుతాం

ట్రెండింగ్‌

Advertisement