e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home జిల్లాలు డమురు డీజే కు యమ క్రేజ్‌..!

డమురు డీజే కు యమ క్రేజ్‌..!

డమురు డీజే కు యమ క్రేజ్‌..!

సిటీబ్యూరో, మార్చి 15: ఢిల్లీలోని వారాంతపు పార్టీల్లో డమురు డీజే పార్టీకి చాలా పేరుంది. ఈ పార్టీలకు యువతీయువకుల్లో క్రేజీ ఉంది.. ఇందులో పాల్గొనడానికి చాలా రోజులుగా ఎదురుచూస్తుంటారు.. సెలవులు వచ్చా యంటే చాలు ఇందులో పాల్గొంటూ ఎంజాయి చేస్తుంటా రు.. కొందరు మద్యంతోపాటు డ్రగ్స్‌ కూడా వాడుతుంటారు.. ఇప్పుడు ఈ డమురు డీజే పార్టీ సంప్రదాయం హైదరాబాద్‌కు చేరుకుంది. ఈ క్రమంలో సంస్థాన్‌నారాయణపురం పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఓ ఫామ్‌హౌస్‌లో గురువారం రాత్రి దీన్ని ఏర్పాటు చేయగా రాచకొండ పోలీసులు భగ్నం చేశారు.. ఎలాంటి అనుమతులు లేకుండా రహస్యంగా ఏర్పాటు చేసిన ఈ పార్టీలో దాదాపు 90 మంది విద్యార్థులు, యువకులు, ప్రైవేట్‌ ఉద్యోగులు పట్టుబడ్డారు. ఈ పార్టీలో డ్యాన్స్‌లతో దుమ్ము రేపేందుకు నిర్వాహకులు గంజాయి, ఎల్‌ఎస్డీ బ్లా ట్స్‌(డ్రగ్స్‌)ను అం దుబాటులో ఉంచారని పోలీసు దర్యాప్తులో బయటప డింది. విచారణలో డమురు డీజే మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్స్‌ చేయాలంటే తప్పనిసరిగా మత్తు ఉండాల్సిందేని నిర్వాహకులు చెప్పారని తేలింది. 

ఇప్పటికే ములుగు ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ పార్టీని నిర్వహించగా అది సక్సెస్‌ అయ్యింది. అప్పటి నుం చి నిర్వాహకులు ఈ సంప్రదాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తృతం చేయాలనుకున్నారు. ఇందులో భాగంగానే నగర శివారులోని సంస్థాన్‌నారాయణపురంలో  ఏర్పాటు చేశా రు. ఇందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ డమురు డీజే మ్యూజిక్‌ ఈవెంట్‌పై ప్రకటన వేయగానే చాలామంది యువకులు ఆస్తకి చూపి మొత్తం 90 మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులు హాజరై పోలీసులకు పట్టుబడ్డారు. అదుపులోకి తీసుకున్న వారిని న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చారు. నిర్వాహకులను రిమాండ్‌కు తరలించారు. 

మత్తులో ఉంటేనే జోష్‌

ఈ డమురు డీజేలో మ్యూజిక్‌ను అందించే బీట్స్‌లో డ్ర మ్స్‌సౌండ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ మ్యూజిక్‌కు కొద్దిగా మత్తు తోడైతే.. ఇక ఆ వ్యక్తి కాలు డ్యా న్స్‌ ఆడడానికి ఉరకలు వేస్తుంది.. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న నిర్వాహకులు అలాంటి వారిని టార్గెట్‌చేసి వారికి గంజాయి, డ్రగ్స్‌లాంటి మత్తు పదార్థాలను విక్రయిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇలా డీజేను ఎం జాయ్‌ చేద్దామని వెళ్లే యువత మత్తుకు బానిసవుతున్నారని పోలీసులు గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన ఉం డటంతో చాలామంది యువత, విద్యార్థులు ఇది చట్టబద్ధమే అయి ఉండవచ్చని భావించి ఆ ఈవెంట్‌కు హాజరయ్యారు. గురువారం పోలీసు దాడుల్లో అసలు విషయం తెలిసి.. ఈ డీజే అక్రమమేనని తెలుసుకుని షాక్‌నకు గురయ్యారు. కావునా.. యువత, విద్యార్థులు ఇలాంటి ఈవెంట్‌లకు వెళ్లి గంజాయి, డ్రగ్స్‌ సేవించి.. తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పోలీసులు కోరుతున్నారు. తల్లి దం డ్రులు కూడా తమ పిల్లలు చెప్పే ఈవెంట్లపై ఆరా తీయాలని.. అనుమతిలేని వాటికి పంపించొద్దని సూచిస్తున్నారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డమురు డీజే కు యమ క్రేజ్‌..!

ట్రెండింగ్‌

Advertisement