e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు కష్టకాలంలోనూ సంక్షేమానికి ప్రాధాన్యం

కష్టకాలంలోనూ సంక్షేమానికి ప్రాధాన్యం

కష్టకాలంలోనూ సంక్షేమానికి ప్రాధాన్యం

ముస్లింలు నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలి
మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ lకల్యాణలక్ష్మి చెక్కులు, మైనార్టీలకు దుస్తుల పంపిణీ

తిమ్మాపూర్‌ రూరల్‌, ఏప్రిల్‌29: కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్‌ సర్కారు సంక్షేమానికి ప్రా ధాన్యమిస్తున్నదని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ ఉద్ఘాటించారు. పెండ్లి చేసుకు న్న ఆడబిడ్డలు ఇబ్బందిపడవద్దనే ఉద్దేశంతో కల్యాణలక్ష్మి చెక్కులు మంజూరు చేస్తున్నదన్నారు. ముస్లింలు రంజాన్‌ను సంతోషంగా జరుపుకునేందుకు దుస్తులు పంపిణీ చేస్తున్నదని చెప్పారు. తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలోగల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కు లు, ముస్లింలకు రంజాన్‌ దుస్తులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా రసమయి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రజల అభ్యున్నతి గురించి ఆలోచిస్తున్నారని చెప్పారు. ముస్లింలు కరోనా నిబంధనలను పాటిస్తూ పండుగను జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఎలుక అనిత, ఇఫ్కో రాష్ట్ర డైరెక్టర్‌ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ఆరె శ్రీధర్‌, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అభాగ్యుడి చికిత్సకు బాసటగా..
తిమ్మాపూర్‌/ఇల్లంతకుంట, ఏప్రిల్‌ 29: అభాగ్యుడి చికిత్సకు బాసటగా నిలిచి సహృదయతను చాటుకున్నాడు ఎమ్మెల్యే రసమయి. ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్త కేశవులు కుమారుడు హరీశ్‌ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకోలేని అతడి దయనీయస్థితిని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన రసమయి, హరీశ్‌ను ఇటీవల హైదరాబాద్‌లోని నిమ్స్‌ దవాఖానలో చేర్పించి మెరుగైన వైద్యం అందేలా చూస్తున్నారు. అలాగే గురువారం తన క్యాంపు కార్యాలయంలో రూ.2 లక్షల ఎల్‌వోసీని హరీశ్‌ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మీసరగండ్ల అనిల్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కష్టకాలంలోనూ సంక్షేమానికి ప్రాధాన్యం

ట్రెండింగ్‌

Advertisement