e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు కల్యాణలక్ష్మితో పేద కుటుంబాల్లో వెలుగులు

కల్యాణలక్ష్మితో పేద కుటుంబాల్లో వెలుగులు

కల్యాణలక్ష్మితో పేద కుటుంబాల్లో వెలుగులు

గోదావరిఖని, ఏప్రిల్‌ 29: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలతో సీఎం కేసీఆర్‌ పేద కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఉద్ఘాటించారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గురువారం 324 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రామగుండం మండలానికి చెందిన 284 మందికి రూ.2,81,35,596ను, పాలకుర్తి మండలానికి చెందిన 40 మందికి రూ.40,04,640 కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పేద కుటుంబాల్లో సీఎం కేసీఆర్‌ ఆడపిల్లల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.లక్షా116 అందిస్తూ పెద్దన్నలాగా నిలుస్తున్నారన్నారు. పేదింటి ఆడ పిల్లలకు ఈ పథకం ఒక వరమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయనీ, దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, జడ్పీటీసీ కందుల సంధ్యారాణి, కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్‌, కన్నూరి సతీశ్‌, కుమ్మరి శ్రీనివాస్‌, కొమ్ము వేణు, దొంత శ్రీను, శంకర్‌ నాయక్‌, కృష్ణవేణి, అంజలి, శివకుమార్‌, వైస్‌ ఎంపీపీ ఎర్రం స్వామి, ఎంపీటీసీ దుర్గం కుమార్‌, అల్లం రాజన్న, తానిపర్తి గోపాల్‌ రావు, బొడ్డు రవీందర్‌, రాకం వేణు, జలపతి, సలీం బేగ్‌, జేవీ రాజు, పొన్నం లక్ష్మణ్‌, తిరుపతి గౌడ్‌, రవీందర్‌ రెడ్డి, తహసీల్దార్‌ సదానందం, రమేశ్‌ ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కల్యాణలక్ష్మితో పేద కుటుంబాల్లో వెలుగులు

ట్రెండింగ్‌

Advertisement