e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, October 24, 2021
Home జిల్లాలు ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు

ఆట పాటలతో సద్దుల బతుకమ్మ సంబురాలు

  • ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అంబరాన్నంటిన ‘సద్దుల’ సంబురాలు..
  • ఆట పాటలతో మార్మోగిన ప్రధాన కూడళ్లు, వీధులు..
  • ప్రభుత్వ కార్యాలయాల్లో సందడి చేసిన ఉద్యోగినులు..
  • సంబురాల్లో పాల్గొన్న కలెక్టర్లు ..
  • చెరువులు, కుంటల్లో బతుకమ్మల నిమజ్జనం..
  • వాయినాలు ఇచ్చిపుచ్చుకున్న ఆడపడుచులు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ‘సద్దుల’ సంబురాలు అంబరాన్నంటాయి. ఆడపడుచులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి గౌరమ్మలను ప్రతిష్ఠించి పూజలు చేశారు. అనంతరం గ్రామ ప్రధాన కూడళ్లు, వీధుల్లో వెంపలి చెట్టు కొమ్మను నాటి పసుపు, కుంకుమలు చల్లి బతుకమ్మలను ఒక్కచోట చేర్చి ఆడిపాడారు. రామ రామ రామ ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలో.., ఇద్దరక్క చెల్లెళ్లు ఉయ్యాలో.. ఒక్క ఊరికిచ్చిరి ఉయ్యాలో.. ఒక్కడే మాయన్న ఉయ్యాలో.. చూసన్న పోడాయే ఉయ్యాలో.. అంటూ లయబద్దంగా పాడారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగినులు సందడి చేయగా, రంగారెడ్డి, వికారాబాద్‌ కలెక్టర్లు పాల్గొన్నారు. చిన్నారులు పటాకులు కాల్చడంలో బిజీగా గడిపారు. ‘సద్దుల’ సంబురాలు అంగరంగ వైభవంగా సాగిన అనంతరం వాగులు, కుంటలు, చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి, వాయినాలు ఇచ్చిపుచ్చుకుని ఫలహారాలు చేశారు.
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ.. చిత్తూచిత్తూల బొమ్మ శివుడీ ముద్దూల గుమ్మ.. అంటూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ సద్దుల బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, అందరి ఇండ్ల ముందర బతుకమ్మ ఆటపాటలతో ఊరేగింపుగా తీసుకెళ్లి స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో, వికారాబాద్‌ కలెక్టర్‌ నిఖిల, ఎస్పీ నారాయణ ఆధ్వర్యంలో తమ మహిళా అధికారులతో కలిసి తమ కార్యాలయాల్లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఊరూ వాడా తేడా లేకుండా పూల పండుగను పుడమి మురువంగా మహిళలు, విద్యార్థినులు అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement