e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home ఆదిలాబాద్ అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలం

అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలం

అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలం

రాజకీయ లబ్ధి కోసమే టీఆర్‌ఎస్‌పై ఆరోపణలు
ప్రత్యేక బెటాలియన్‌తో పాటు ఓఎస్డీని నియమించాలని కోరాం..
శాశ్వత పరిష్కారం కోసం అసెంబ్లీలో చర్చిస్తాం..
రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

భైంసా, మార్చి 13 : నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో తరచూ జరిగే అల్లర్లతో నష్టపోయేది పేదలేనని, ఇప్పటికైనా సంయమనం పాటించాలని రాష్ట్ర న్యాయ, దేవాదా య అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. భైంసా, మహగాంలో శనివారం ఆయన పర్యటించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భైంసాలో అల్లర్ల ఘటన చాలా దురదృష్టమని, ఇలాంటి వాటితో పట్టణాభివృద్ధికి భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. భైంసాను అభివృద్ధి బాటలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ సంయమనంతో ముందుకెళ్లాలని సూచించారు. చిన్న చిన్న సంఘటనలు పెద్దవి కాకుండా అందరూ కలిసి చర్చించుకోవాలని కోరారు. భవిష్యత్‌లో ఇలాంటి నష్టం జరుగకుండా ప్రత్యేక బెటాలియన్‌ ఏర్పాటుతోపాటు ఓఎస్డీని నియమించాలని సీఎం కేసీఆర్‌ను, హోం శాఖ మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారానికి అసెంబ్లీలో చర్చిస్తానని తెలిపారు. గిట్టనివారు రాజకీయ లబ్ధి కోసమే టీఆర్‌ఎస్‌ పార్టీపై నిందారోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహగాం గ్రామంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త ఆటోలు తగలబెట్టడం బాధాకరమని, కలిసి ఉండే గ్రామాల్లో ఇ లాంటి ఘటనలు దురదృష్టకరమన్నారు. ఇకనైనా ప్రజ లు వాస్తవాలు గమనించి, అభివృద్ధికి సహకరించాలన్నా రు. 8 రోజులుగా ఆన్‌లైన్‌ సేవలు నిలిపివేయడం తో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేశారు.

- Advertisement -

సంయమనం పాటించాలి : ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి
అందరూ సంయమనం పాటించాలని స్థానిక ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కోరారు. భైంసాలో వరుస ఘటనలతో అభివృద్ధి కుంటుపడుతుందని, సామాన్య మధ్య తరగతి ప్రజలు, చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కృష్ణ, నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కిషన్‌ రెడ్డి, సత్యనారాయణ గౌడ్‌, రాజన్న, తోటరాము, పాకాల రాంచందర్‌, ఆసిఫ్‌, ఫారూఖ్‌ పాల్గొన్నారు.

బాధితులను పరామర్శించిన మంత్రి
మండలంలోని మహగాం గ్రామంలో గురువారం అర్ధ రాత్రి జరిగిన రెండు ఆటోలు, హోటల్‌ దహనం బాధి తులను మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసు కున్నారు. ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చూ స్తానని ఆయన హామీనిచ్చారు. వీరి వెంట కలెక్టర్‌ ము షార్రఫ్‌ అలీ ఫారూఖీ, ఆర్డీవో రమేశ్‌ రాథోడ్‌, రూరల్‌ సీఐ చంద్రశేఖర్‌, భైంసా మార్కెట్‌ చైర్మన్‌ పిప్పెర కృష్ణ, సర్పంచ్‌ అప్పాల రాకేశ్‌, తదితరులున్నారు.

7 నుంచి 11 గంటల వరకు సడలింపు..
పట్టణంలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. ఆదివారం నుం చి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు సడలింపు ఇ చ్చారు. ఇప్పటివరకు అల్లర్లతో సంబంధం ఉన్న 36 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరో 38 మంది పరారీలో ఉన్నారు. అడుగుడుగునా పో లీస్‌ తనిఖీలు చేపడుతున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెట్‌ ఏర్పాటు చేసి నిఘా పెడుతున్నారు. ఇండ్ల నుంచి ప్రజలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనబడుతున్నాయి. ఇన్‌చార్జి ఎస్పీ విష్ణు వారియర్‌తో పాటు కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలం
అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలం
అల్లర్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలం

ట్రెండింగ్‌

Advertisement