అందరి క్షేమం కోసం కేసీఆర్‌ ఆరాటం


Sat,December 7, 2019 11:01 PM

-ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
ఆలేరుటౌన్‌: అందరి క్షేమం కోసమే సీఎం కేసీఆర్‌ ఆరాటమని ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆలేరు పట్టణంలోని తహసీల్దారు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని ప్రజాసంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచాలని, నిరంతరం వారు ఏమి చేస్తున్నారో గమనించాలన్నారు. పిల్లల భవిష్యత్‌ కోసం వారు చదువుతున్న విషయాల గురించి, వారితో స్నేహితులుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దారు శ్యాంసుందర్‌రెడ్డి, ఎండీవో హనమంతప్రసాద్‌, ఐసీడీఎస్‌ సీడీపీవో చంద్రకళ, డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ మేనేజర్‌ వెంకటేశ్వర్లు, సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌, వీఆర్వోలు పాల్గొన్నారు.

నార సంచుల పంపిణీ..
ప్లాస్టిక్‌కు బదులుగా నార సంచులు వాడాలని ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ అతిథిగృహంలో వస్పరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంతో నార సంచులను ఆమె పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్‌ యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు మెరిగాడి వెంకటేశ్‌, రైతు సమితి జిల్లా సభ్యుడు ఆకవరం మోహన్‌రావు, నాయకులు మదాని పిలిఫ్‌, తునికి రామారావు, మెగిలి మల్లేశ్‌, సీస మహేశ్వరి, కందుల రామన్‌, క్యాసగళ్ల అనసూయ, గుత్తా శ్యమంతకరెడ్డి, కుండె సంపత్‌, సరాబు సంతోశ్‌కుమార్‌, కూళ్ల సిద్ధులు, కూతాటి అంజన్‌కుమార్‌, జూకంటి శ్రీకాంత్‌, చింతకింది మురళి, జల్లి నర్సింహులు, బీజని మధు, దూడం మధు, తాళ్లపల్లి మహేశ్‌, మెరిగాడి ఇందిర, మోరిగాడి సుజాత పాల్గొన్నారు.

మొక్కలు నాటిన ప్రభుత్వవిప్‌
రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆలేరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవఖానాలో విప్‌ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమలో ఏరియా దవాఖాన సిబ్బంది, నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇంటింటికి తిరుగుతూ కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వవిప్‌
పేదింటి బిడ్డలకు అందిస్తున్న కల్యాణలక్ష్మి చెక్కులను ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి శనివారం ఆలేరు పట్టణంలోని 42 మంది లబ్ధిదారులకు స్వయంగా ఇంటింటికీ తిరుగుతూ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు లబ్ధిదారులు హారతిపట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మంచి అవకాశం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వవిప్‌
సాయిగూడెం చర్చి ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో ప్రభుత్వవిప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్‌ సీహెచ్‌ శ్రీనివాస్‌ ఆమెకు ఏసు ఆశీర్వాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ప్రభాకర్‌, దేవదానం పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...