ప్రభుత్వభూమిని కాపాడాలని వినతి


Thu,December 5, 2019 12:09 AM

ఆలేరుటౌన్‌ : సర్వే నెం. 1026లోని ప్రభుత్వభూమిని భూ అక్రమార్కుల నుంచి కాపాడాలని బహదూర్‌పేట మాజీ సర్పంచ్‌ జంపాల దశరథ అధికారులను కోరారు. బుధవారం ఆలేరు పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి సర్వే నెం.1026లో ప్రభుత్వభూమిని అక్రమార్కులు కబ్జా చేస్తున్నారన్నారు. ఆలేరు పట్టణంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయిందని, కొందరు వ్యక్తులు భూ కబ్జా దందాలకు పాల్పడుతూ వాటిని అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


ప్రభుత్వ, ప్రైవేటు భూములను ఆక్రమిస్తూ వాటి యాజమానులను బెదిరిస్తున్నారని, ప్రజాప్రతినిధుల పేరు చెప్పుకొని రెవెన్యూ అధికారులను లోబర్చుకొని కోట్లాది రూపాయలను సంపాదించుకుంటున్నారని తెలిపారు. భూకబ్జాలకు సంబంధించి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని, వాటిని త్వరలో బయటపెడుతానని తెలిపారు. విలువైన ప్రభుత్వ భూముల కబ్జాలకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో దావా వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సర్వే నెం.1026లోని ప్రభుత్వ భూ అక్రమాలను అరికట్టి ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ మండల తహసీల్దార్‌ శ్యాంసుందర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

37
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...