విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి


Thu,December 5, 2019 12:09 AM

గుండాల : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు నాణ్యతా ప్రమాణాలతో అందించాలని వైస్‌ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని వస్తాకొండూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏజెన్సీ నిర్వాహకులు మెనూ ప్రకారం విద్యార్థులకు కోడి గుడ్డుతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. భోజనం వడ్డించే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ చైర్మన్‌ రవి, తదితరులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం


భోజనం అందివ్వాలి..
ఆత్మకూరు(ఎం) : మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందివ్వాలని మండలంలోని కూరెళ్ల ప్రాథమిక పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌ గడ్డం అశోక్‌ వంట ఏజెన్సీలకు సూచించారు. బుధవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంట ఏజెన్సీలు పరిశుభ్రతను పాటించడంతో పాటు విద్యార్థులందరికీ సరిపడ భోజనం అందివ్వాలన్నారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు కట్ట రమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు బెజ్జంకి భిక్షం తదితరులు ఉన్నారు.

29
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...