రాష్ర్టాభివృద్ధిని ఓర్వలేకే కుట్రలు


Thu,December 5, 2019 12:08 AM

-తుంగుతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌
అడ్డగూడూరు: తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఓర్వలేక ఓ ఆంధ్రపత్రిక విషపు రాతలు రాస్తున్నదని ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. బుధవారం అడ్డగూడూరు మండలం చిర్రగూడూరులో జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలు వెచ్చించి తిరుపతి దేవస్థానం కంటే గొప్పగా యాదాద్రిని అభివృద్ధి చేయాలని సీఎం కేసీఆర్‌ కృషి చేస్తుంటే అది జీర్ణించుకోలేని కొన్ని పత్రికలు, కొంతమంది రాజకీయ నాయకులు కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. పత్రికలు బాధ్యతాయుతంగా మెలగాలని అన్నారు.

దేవుడి రూపాన్ని మార్చారని పత్రికల్లో రాయడం సిగ్గుచేటని అన్నారు. మీడియా స్వేచ్ఛ పేరుతో ఎల్లోయిజాన్ని ప్రదర్శించాలనుకుంటే ప్రజలు తగిని బుద్ధి చెబుతారన్నారు. కోటమర్తి-అడ్డగూడూరు, వెల్దేవి-మానాయికుంట, కంచనపల్లి-డి.రేపాక గ్రామాల మధ్య బీటి రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాములజ్యోతిఅయోధ్య, మోత్కూరు జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, మోత్కూరు మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ కొణతం యాకుబ్‌రెడ్డి, జిల్లా కోఆప్షన్‌ మెంబర్‌ గుండిగ జోసఫ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు పొన్నాల వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్రనాథ్‌, తీపిరెడ్డి మేఘారెడ్డి, మాజీ ఎంపీపీ ఓర్సు లక్ష్మి, సర్పంచ్‌ కమ్మంపాటి పరమేశ్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధానకార్యదర్శి చౌగోని సత్యంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...