తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం


Thu,December 5, 2019 12:07 AM

అడ్డగూడూరు: దేశంలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. బుధవారం అడ్డగూడూరు మండల కేంద్రం నుంచి పాటిమట్ల ఎక్స్‌ రోడ్డు వరకు రూ.13 కోట్ల సీఆర్‌ఎఫ్‌ నిధులతో చేపట్టిన డబుల్‌ రోడ్‌ పనులకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డితో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వాలు తెలంగాణను నిర్లక్ష్యం చేస్తే సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారన్నారు.

కార్యక్రమంలో గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ మందుల సామేల్‌, ఎంపీపీ దర్శనాల అంజయ్య, అడ్డగూడూరు, మోత్కూరు జడ్పీటీసీలు శ్రీరాముల జ్యోతిఅయోధ్య, గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, జిల్లా కో ఆప్షన్‌ మెంబర్‌ గుండిగ జోసఫ్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మెన్‌ కొణతం యాకుబ్‌రెడ్డి, సర్పంచ్‌ బాలెంల త్రివేణి, ఎంపీటిసి పెండెల భారతమ్మ, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పూలపల్లి జనార్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు పొన్నాల వెంకటేశ్వర్లు, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్రనాథ్‌, తీపిరెడ్డి మేఘారెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రమేష్‌బాబు, ఈఈ శంకరయ్య, డీఈ వజేద్‌శెహనాథ్‌, ఏఈ ఆలి, లింగయ్య, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు పాల్గొన్నారు.

అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లో చేరికలు
అభివృద్ధిని చూసే ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌లో పలువురు చేరుతున్నారని మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌, జడ్పీ చైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి అన్నారు. అడ్డగూడూరు మండలం చిర్రగూడూరు గ్రామానికి చెందిన రిటైర్డ్‌ సీఐ శ్రీరాములఅయోధ్య బుధవారం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలన్నారు. అన్ని వర్గాలకు సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌ అందిస్తున్నారన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య, జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతిఅయోధ్య, జిల్లా కో ఆప్షన్‌ మెంబర్‌ గుండిగ జోసఫ్‌, మార్కెట్‌ కమిటీ, మోత్కూరు మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ కొణతం యాకుబ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మాజీ మండలాధ్యక్షుడు పొన్నాల వెంకటేశ్వర్లు, మోత్కూరు జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, చిర్రగూడూరు సర్పంచ్‌ కమ్మంపాటి పరమేశ్‌, మాజీ ఎంపీపీ ఓర్సు లక్ష్మి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్రనాథ్‌, తీపిరెడ్డి మేఘారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల ప్రధానకార్యదర్శి చౌగోని సత్యంగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

21
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...