లంచం వద్దు.. ప్రజాసేవే ముద్దు


Thu,December 5, 2019 12:07 AM

కలెక్టర్‌ అనితారామచంద్రన్‌
ఆత్మకూరు(ఎం): లంచాలకు ఆశపడకుండా రెవెన్యూ అధికారులు నిజాయితీగా విధులు నిర్వహించి ఆ శాఖకు మంచి పేరు తేవాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. బుధవారం ఆత్మకూరు(ఎం)లోని మండల పరిషత్‌ కార్యాలయంలో మోత్కూరు, ఆత్మకూరు(ఎం), గుండాల, అడ్డగూడూరు మండలాలకు చెందిన రెవెన్యూ అధికారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతుల నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు.

గ్రామాలలో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులకు అందజేయాలన్నారు. ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో చేర్చాలన్నారు. బిక్కేరు వాగు నుంచి తరలుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో భువనగిరి ఆర్డీవో వెంకటేశ్వర్లు, డీఏవో ఉపేందర్‌రెడ్డి, ఆత్మకూరు(ఎం), మోత్కూరు, అడ్డగూడూరు, గుండాల, ఆలేరు మండలాల తహసీల్దార్లు జ్యోతి, హైమద్‌, రామకృష్ణ, బ్రహ్మయ్య, శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీడీవో రాములుతో పాటు వివిధ మండలాల ఆర్‌ఐలు, సీనియర్‌ అసిస్టెంట్‌లు, వీఆర్వోలు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...