జీవ వైవిధ్య మండలస్థాయి యాజమాన్యకమిటీ ఏర్పాటు


Wed,November 20, 2019 12:19 AM

చౌటుప్పల్ రూరల్: జీవ వైవిధ్య మండల స్థాయి యాజమాన్య కమిటీని మంగళవారం స్థానిక మండలపరిషత్ కార్యాలయంలో ఎన్నుకున్నారు. ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. జీవవైవిధ్య యాజమాన్య కమిటీ చైర్మన్‌గా తాడూరి వెంకట్‌రెడ్డి, సభ్యకార్యదర్శిగా చిట్టెంపల్లి శ్రీనివాస్, మహిళాసభ్యురాలిగా సురిగి రాజమ్మ, బోయ ఇందిర, సభ్యులుగా చెన్నబోయిన వెంకటేశం, బద్దం కొండల్‌రెడ్డి, మందుల శ్రీశైలం ఎన్నికయ్యారు. ఎంపీడీవో రాకేశ్‌రావు, ఎంపీటీసీలు, సిబ్బంది పాల్గొన్నారు.

కాలుష్యకారక పరిశ్రమలపై చర్యలు తప్పవు

చౌటుప్పల్, నమస్తేతెలంగాణ: కాలుష్య కారక పరిశ్రమలపై చర్యలు తప్పవని ఆర్డీవో ఎస్ సూరజ్‌కుమార్ హెచ్చరించారు. ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల ఎంపీటీసీలు మంగళవారం ఆర్డీవోను కలిశారు. మండలంలోని పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం వల్ల తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆర్డీవో దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని కోళ్ల పరిశ్రమల నుంచి దుర్వావస వస్తుందని , అక్కడ నివసించాలంటేనే ప్రజలు భయడుతున్నారని తెలిపారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను సీజ్‌చేస్తామన్నారు. ప్రజల ప్రాణాలకు ముప్పు తీసుకొస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఆగ్రో ఫాం పరిశ్రమను సైతం సీజ్ చేశామని, హైకోర్టే స్టే విధించడంతో తిరిగి వారు పరిశ్రమను తెరిచారని తెలిపారు. ఇప్పటికే సదరు పరిశ్రమ పై పొలుష్యన్ కంట్రోల్ బోర్డుకు ఫిర్యాదు చేశామని, తదుపరి వారి నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల ఎంపీటీసీలు పాల్గొన్నారు.

ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
సంస్థాన్‌నారాయణపురం: ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచు కట్టెల భిక్షపతి అన్నారు. మండలంలోని సర్వేల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం 2019-20 సంవత్సరానికి సంబంధించి ఉపాధిహామీ పథకంలో చేపట్టాల్సిన పనులపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ పొలంలో చేపట్టాల్సిన పనులు, ఇంటిముందు ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులకు ఉపాధిహామీ సిబ్బందికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచు బూస శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి లింగస్వామి, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...