ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య


Wed,November 20, 2019 12:18 AM

బీబీనగర్: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్ అన్నారు. మండలంలోని గూడూరు, అన్నంపట్లలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సహకారంతో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అల్పాహార కార్యక్రమాన్ని మంగళవారం జడ్పీటీసీ గోళి ప్రణీతాపింగళ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొలను లావణ్యాదేవేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంఈవో నాగవర్ధన్‌రెడ్డి, అన్నపూర్ణ ట్రస్టు ఇన్‌చార్జి రామ్మూర్తి, సర్పంచులు బొక్క వసుమతి, గూడూరు బాల్‌రెడ్డి, ఎంపీటీసీలు తొర్పునూరి స్వప్నారాజశేఖర్, కొలను సత్యమణి, ఉపసర్పంచు, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విరాళాలు అందజేసిన నాయకులు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎంపీపీ కోరుతూ తన వంతు సహాయంగా రూ.25వేలు అందజేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందిస్తూ రూ.6.62 లక్షల విరాళాలు అందజేశారు. గ్రామాల వారీగా విరాళాలు అందజేసిన వారు గూడూరులో.. ఎంపీటీసీ తొర్పునూరి స్వప్నారాజశేఖర్‌గౌడ్ లక్ష, జి. విజయనిర్మల లక్ష, టీఆర్‌ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు రూ.50వేలు, గౌడ సంఘం అధ్యక్షుడు వనం శ్రీశైలంగౌడ్ రూ.50వేలు, సర్పంచ్ గడ్డం బాల్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు కసగోని పరమేశ్‌గౌడ్, వార్డు సభ్యులు రూ. 25వేలు, మాజీ ఎంపీటీసీ బింగి అలివేలుమంగాశ్రీనివాస్ రూ. 10వేలు, ఉపాధ్యాయ బృందం రూ.20వేలు అందజేయగా... అన్నంపట్లలో.. సర్పంచు బొక్క వసుమతిజైపాల్‌రెడ్డి లక్ష, కొండల్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి రూ.20వేలు, మార్కెట్ కమిటీ చైర్మన్ రూ.12వేలు, ఎంపీటీసీ కొలను సత్యమణి, ఆంజనేయులుగౌడ్, దేవేందర్‌రెడ్డి, పాండు, కృష్ణ, రూ.10వేలు, ఆనంద్, రాజిరెడ్డి, శ్రీశైలం, పోచిరెడ్డి, బొక్క శ్రీనివాస్, దామోదర్‌రెడ్డి ఒక్కొక్కరు రూ. 5వేల చొప్పున అందజేశారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles