సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలి


Wed,November 20, 2019 12:18 AM

బీబీనగర్: సబ్సిడీ రుణాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి కోరారు. మండలంలోని గూడూరులో మంగళవారం సహకార సంఘం బ్యాంకు బీబీనగర్ మేనేజర్ సునీత ఆధ్వర్యంలో సబ్సిడీ రుణాలపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న వ్యవసాయేతర సబ్సిడీ రుణాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సహకార బ్యాంకు ద్వారా రైతులకు ట్రాక్టర్లు, పాలీహౌజ్, గేదెలు, పందిరి సాగులపై సబ్సిడీ రుణాలు అందించనున్నట్లు పేర్కొన్నారు. మండలంలో అర్హులైన రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం బ్యాంకులో ఖాతాదారులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులను అందజేశారు. బ్యాంకు సిబ్బంది, పీఏసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

32
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...