విద్యార్థులకు విద్యాజ్యోతి చెక్కుల పంపిణీ


Wed,November 20, 2019 12:18 AM

మోటకొండూర్ : కెనరా బ్యాంక్ 114వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్‌లో ఉన్నత పాఠశాల విద్యార్థులకు విద్యాజ్యోతి స్కాలర్‌షిప్ చెక్కులను ఆ బ్యాంకు జిల్లా లీడ్ మేనేజర్ నాగార్జునబాబు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఆరు, పది తరగతులు చదువుతున్న ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు విద్యాజ్యోతి చెక్కులు పంపిణీ చేశామని మేనేజర్ నాగార్జున తెలిపారు. విద్యార్థులు విద్యాభ్యాసంపై ప్రత్యేక దృష్టి సారించి మంచి ఫలితాలు సాధించి ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించారు. అనంతరం పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 9,10వ తరగతి విద్యార్థులకు రూ.5 వేలు, 7,8వ తరగతి విద్యార్థులకు రూ.2500 నగదు అందించారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ్, అనిల్‌కుమార్, వినోద్‌కుమార్, సందీప్, ఉపాధ్యాయులు దానయ్య, సత్యనారాయణ, సుధాకర్, శ్రీనివాస్, సదా, వంగపల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేత..
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కెనరా బ్యాంకు యాదగిరిగుట్ట శాఖ వారు ప్రోత్సాహకాలు అందజేశారు. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలో కెనరా బ్యాంకు 114వ వ్యవస్థాపన దినోత్సవం సందర్భంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కెనరా విద్యాజ్యోతి పథకం ద్వారా పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో 8,9,10వ తరగతిలోఉత్తమ ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు ఒక్కొక్కరికి రూ.5 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కెనరా బ్యాంకు మేనేజర్ విక్రమ్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు నిర్మల తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...