సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి


Tue,November 19, 2019 12:01 AM

చౌటుప్పల్‌ రూరల్‌ : సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో సూరజ్‌కుమార్‌, జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డిలు అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని స్థానిక వ్వవసాయం మార్కెట్‌ యార్డ్‌లో సీసీఐ మహబూబ్‌నగర్‌ బ్రాంచి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తికొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలపరిధిలోని తూఫ్రాన్‌పేట గ్రామంలోని కే.ఎల్‌.కాటన్‌ ఇండస్ట్రీస్‌, చిట్యాలమండలం పెద్దకాపర్తిలోని కావేజి జిన్నింగ్‌ మిల్లులో పత్తి కొనుగోలు జరుగుతాయన్నారు. దినిని రైతులు గుర్తించుకొని పత్తిని ఆరబెట్టి నాణ్యాత ప్రమాణాలు పాటించి కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు. 8శాతం నుంచి 12శాతం వరకు మాత్రమే తేమ ఉండవలెనని వారు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు పత్తిని తరలించేటప్పుడు విధిగా రైతు గుర్తింపు కార్డు, బ్యాంక్‌ పాసుపుస్తకం, పట్టదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌ తో పాటు సంబంధిత రైతులు తప్పకుండా వెళ్లాలని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సత్తయ్య, సింగిల్‌విండో చైర్మన్‌ చీరిక సంజీవరెడ్డి,ఏవో ఎం.నాగరాజు, గ్రాంథాలయ చైర్మన్‌ ఊడుగు మల్లేశంగౌడ్‌, మాజీ వైస్‌ఎంపీపీ బొంగు జంగయ్యగౌడ్‌, సీసీఐ అధికారి సాంబశివరావు, మార్కెట్‌ కార్యాదర్శి ఎం.డీ ఫసియొద్దీన్‌, సిబ్బంది ఈ. చీనా, ఆర్‌. ఎల్లయ్య, ఎం.రమేశ్‌, పి.నర్సింహ, సి.హెచ్‌.బాబురావు, పత్తి మిల్లుల ప్రతినిధులు సంతోశ్‌, విఠల్‌ తదితరలు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...