షిర్డీకి నారాయణ స్వామిజీ పాదయాత్ర


Sun,November 17, 2019 11:18 PM

భూదాన్‌పోచంపల్లి : లోక కళ్యాణార్థం తన 18వ పాదయాత్రను షిర్డీ క్షేత్రానికి ప్రారంభిస్తున్నట్టు మండల పరిధిలోని దేశ్‌ముఖి గ్రామంలోని దక్షిణ షిర్డీ క్షేత్రం, శ్రీ సాయి బృందావన క్షేత్రంలోని విశ్వశాంతి సాయి సేవా ప్రచార్ అండ్ చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు ఘంటా నారాయణ స్వామి గురూజీ అన్నారు. ఆదివారం సాయి బృందావనం నుంచి షిర్డీ క్షేత్రానికి తన 18వ పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని అశాంతి, అహింస, అన్యాయాలు, అరాచకాలు, లంచగొండితనంతోపాటు అనేక రుగ్మతులు పూర్తిగా మాసిపోవాలనే సంకల్పంతో ఈ పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. తాను వెళ్లే దారి పొడవునా సాయి చేసిన బోధనలు ప్రజలకు వినిపిస్తూ కొందరైనా సన్మార్గంలో పయనించేలా మారలాలనే ఆలోచనతో ముందుకు సాగుతానని తెలిపారు. తన పాదయాత్ర డిసెంబర్ 2న షిర్డీ చేరుతుందని తెలిపారు. 16 రోజులపాటు 640 కిలో మీటర్లు పాదయాత్ర చేమనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులతోపాటు కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ ఈశ్వరమ్మ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఘంటా నారాయణస్వామితోపాటు పాదయాత్రలో డి.రవి, సాయిరామ్, బిప్రసాద్‌తోపాటు పలువురు ఉన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...