ఆలేరును సుందరంగా తీర్చిదిద్దాలి


Sat,November 16, 2019 11:31 PM

ఆలేరుటౌన్: ఆలేరు పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని రహదారి భవనంలో ఆలేరు పురపాలక సంఘం అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరైన రూ.20 కోట్ల రూపాయలతో తలపెట్టిన అభివృద్ధి పనులపై అధికారులు, కాంట్రాక్టర్ల చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలేరు పట్టణంలో అభివృద్ధి పనులను వేగిరం చేయాలన్నారు. మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంజూరు చేసిన రూ.20 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసి ఆలేరును ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. ఇప్పటికే రూ.2 కోట్లతో పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. దుర్గమ్మ దేవాలయం నుంచి కొలనుపాక సంతోషిమాత దేవాలయం కొలనుపాక రోడ్డు వరకు రూ.2 కోట్లతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు, కల్వర్ట్ పనులు యుద్ధప్రాతిపదికన పది రోజుల్లో పూర్తి చేయాలన్నారు. రూ.1.20 కోట్ల నిధులతో మదర్‌డెయిరీ సెంటర్ నుంచి దుర్గమ్మ దేవాలయం నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్ పనులకు సంబంధించి పనులను వెంటనే ప్రారంభించాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. రూ.కోటితో ఏర్పాటు చేయనున్న పార్కుల నిర్మాణం పనులు వెంటనే చేపట్టాలన్నారు. అలాగే రూ.కోటితో నిర్మించనున్న స్మృతి వనాన్ని నియోజకవర్గంలోనే సుందరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. సమావేశంలో మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి ఉపేందర్‌రెడ్డి, మేనేజర్ వెంకటేశ్వర్లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీరు రాజయ్య, ఏఈ రాజీవ్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు ఆకవరం మోహన్‌రావు పాల్గొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...