ఓటమి గెలుపునకు పునాది కావాలి


Sat,November 16, 2019 11:30 PM

ఆలేరుటౌన్ : క్రీడలలో ఓటమి క్రీడాకారులకు గెలుపునకు పునాది కావాలని యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాధికారిణి చైతన్యజైని అన్నారు. 65వ పాఠశాల ఉమ్మడి నల్లగొండ జిల్లాస్థాయి అండర్-14 ఫుట్‌బాల్ క్రీడాకారుల ఎంపిక పోటీలు శనివారం ఆలేరు పట్టణంలో జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. క్రీడలతో మానసిక, శారీరకంగా దృఢంగా తయారవుతారన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే క్రమశిక్షణతో బావి భారతపౌరులుగా ఎదుగాలన్నారు. క్రీడల్లో జిల్లాను అగ్రభాగంలో నిలుపాలన్నారు. క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఈ ప్రాంత పీఈటీలు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎన్‌సీసీ విద్యార్థులు అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ఆలేరు పాఠశాలకు మంచి పేరు తెస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. పదోతరగతి విద్యార్థులు ఉత్తమ గ్రేడ్‌లు సాధించాలన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని ఫుట్‌బాల్ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి రఘురాంరెడ్డి, మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ, జిల్లా క్రీడల కార్యదర్శి తునికి విజయసాగర్, పీఈటీలు మురళి, పూల నాగయ్య, గడసంతల మధుసూదన్, మదాని జోసెఫ్, కోనేటి గోపాల్, భవన, రీటా వసంతకుమారి, తునికి చంద్రశేఖర్, ప్రభావతి, యాదగిరి, బాలాజీ, చంద్రమౌళి, కృష్ణ తదితరులున్నారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles