రైతుకు న్యాయం చేసింది సీఎం కేసీఆర్ ఒక్కరే


Fri,November 15, 2019 11:40 PM

-ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
-ఆలేరులో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఆలేరుటౌన్ : ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి రైతులకు వందశాతం న్యాయం చేసింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని ప్రభుత్వవిప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆలేరు పట్ణణంలోని మల్లికార్జున కాటన్‌మిల్లులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ విలేకరులతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర కల్పించి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలున్నా.. 15వ తేదీ నుంచి పత్తి కొనుగోలు చేయాలన్న వినతి మేరకు మూడు రోజులు ముందుగానే ఆలేరులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. క్వింటాలుకు రూ.5550 గిట్టుబాటు ధర కల్పించిన సీసీఐ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఎకరానికి 6 క్వింటాల కంటే ఎక్కువ పత్తి దిగుబడి కాలేదని వ్యవసాయాధికారులు అంచనా వేశారన్నారు.

ఇది తన దృష్టికి వచ్చిన వెంటనే తాను వ్యక్తిగతంగా వ్యవసాయాధికారులను కలిసి మాట్లాడానన్నారు. సమృద్ధిగా కురిసిన వర్షాలతో రైతులకు పత్తి దిగుబడి అధికంగా ఉత్పత్తి జరిగిందని.. ఎకరానికి 12 క్వింటాల చొప్పున కొనుగోలు చేయాలని విన్నవించినట్లు తెలిపారు. సీసీఐ అధికారులు కూడా రైతులకు సహకరిస్తున్నారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. రైతులు దళారుల చేతిలో మోసపోరాదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పత్తిని అమ్మి లబ్ధి పొందాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రానికి వచ్చేముందు రైతులు తమ పాస్‌బుక్, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జీరాక్స్ ప్రతులు తీసుకురావాలని కోరారు. కొనుగోలు కేంద్రం గురించి ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పడాల శ్రీనివాస్, సీసీఐ సీపీవో అమిత్‌ను మల్లికార్జున కాటన్‌మిల్ మేనేజింగ్ పార్టనర్ ఇల్లెందుల మల్లేశ్ దంపతులు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఎంపీపీ అనసూర్య, యాదగిరిగుట్ట, మోటకొండూర్ జడ్పీటీసీలు తోటకూర అనూరాధ, పళ్ల వెంకట్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, పట్టణ అధ్యక్షుడు మోరిగాడి వెంకటేశ్, రైతు సమన్వయ సమితి సభ్యుడు ఆకవరం మోహన్‌రావు, మండల ప్రచార కార్యదర్శి కోటగిరి ఆంజనేయులు, ఏసిరెడ్డి మహేందర్‌రెడ్డి, అడెపు బాలస్వామి, వస్పరి శంకరయ్య, సీస మహేశ్వరి, వట్టిపల్లి మెగిలి మల్లేశ్, జూకంటి శ్రీకాంత్, కుండె సంపత్, పొరెడ్డి శ్రీనివాసు, గవ్వల నర్సింహులు, చింతకింది మురళి, కందుల రామన్, 1వ వార్డు అధ్యక్షుడు సరాబు సంతోశ్‌కుమార్, బీజని మధు, 4వ వార్డు అధ్యక్షుడు కూతాటి అంజన్, దూడం మధు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతు సమన్వయ సమితి సభ్యులు, సర్పంచులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles