పారిశుధ్య నిర్వహణ ప్రతిఒక్కరి బాధ్యత


Fri,November 15, 2019 11:37 PM

తుర్కపల్లి : పారిశుధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తుర్కపల్లి సర్పంచ్ పడాల వనితాశ్రీనివాస్ అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గ్రామపంచాయతీ జనరల్‌బాడి సమావేశంలోఆమె పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ సిబ్బంది గ్రామంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలు ఇంటిపన్నులు సకాలంలో చెల్లించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలన్నారు. అనంతరం ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టనున్న పనులపై గ్రామ సభలో చర్చించారు. సమావేశంలో ఉప సర్పంచ్ తలారి హేమలత, సీనియర్ సిటీజన్ పడాల చంద్రం, ఫీల్డ్‌అసిస్టెంట్ చాంద్‌పాషా, వార్డు సభ్యులు ఉన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles