సజావుగా ప్రయాణం


Fri,November 15, 2019 11:37 PM

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: ఒకవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుంటే.. మరో వైపు జిల్లాలో ఆర్టీసీ సేవలు ప్రజలకు చేరువవుతున్నాయి. శుక్రవారం 42వ రోజు సమ్మెలో భాగంగా జిల్లాలోని 142 బస్సులను నడిపించి ప్రయాణికులను తమ గమ్యస్థానాలను చేర్చారు. ఇందులో ఆర్టీసీ బస్సులు 63, అద్దె బస్సులు 14, ఇతర ప్రైవేట్ వాహనాలు 63 ఉన్నాయి. గడిచిన 42 రోజులుగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తున్నారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా జిల్లాలో ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ, ఆర్టీసీ, జిల్లా రవాణాశాఖ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు. ఆర్టీసీ జేఏసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నా.. ప్రభావం మాత్రం నామమాత్రమే కనిపించింది.

42వ రోజుకు సమ్మె..
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మికుల చేపట్టిన సమ్మె 42వ రోజుకు చేరుకున్నది. దినదినం ఆర్టీసీ కార్మికుల్లో ఆశలు సన్నగిల్లుతుంటే.. మరోవైపు అధికారులు మాత్రం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని యాదగిరిగుట్ట డిపోలో మొత్తం 108 బస్సులుండగా ఇందులో శుక్రవారం రోజున 79 బస్సులను నడిపించారు. మరోవైపు 63 ప్రైవేట్ వాహనాలను ప్రయాణిలకు అందుబాటులో ఉంచారు. మొత్తంగా జిల్లాలో 142 బస్సులు అధికారులు నడిపించారు.

సమ్మె నామమాత్రమే..
జిల్లాలో సమ్మె నామమాత్రంగానే ఉంటూ వస్తున్నది. జిల్లాలో ఆర్టీసీ సేవలు 75 శాతం అందుతుండటంతో ప్రజల ప్రయాణం సాఫీగా సాగుతున్నది. యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి బస్టాండ్‌ల్లో ఎప్పటిలాగే ప్రయాణికుల రద్దీ కనిపించింది. ఉదయం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండ్‌ల్లోకి వచ్చారు. తమ తమ గమ్యస్థానాలకు వెళ్లే బస్సులను ఉత్సాహంగా ఎక్కారు. కాగా శుక్రవారం ఆర్టీసీ కార్మికులు యాదగిరిగుట్ట పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి, డిపో వద్ద ధర్నా చేశారు

19
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...