రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ పరీక్షలు


Fri,November 15, 2019 11:37 PM

ఆలేరుటౌన్: రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతీయువకులకు శుక్రవారం ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలకు ప్రత్యేక పరిశీలకులుగా జిల్లా ఉపాధికల్పన అధికారి సాహితి హాజరయ్యారు. అనంతరం ప్రధానమంత్రి కౌశల్‌యోజన కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణపై అవగాహన కల్పించి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉపాధికల్పన అధికారి సాహితి మాట్లాడుతూ నేటి ప్రపంచంలో స్వయం ఉపాధి కల్పన కోర్సులకు మంచి ఆదరణ ఉన్నదని స్పష్టం చేశారు. నిరుద్యోగులు వ్యక్తిగత నైపుణ్యాన్ని పెంపొదించుకోవాలని పిలుపునిచ్చారు. రాంకీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్తున్న స్పల్పకాలిక కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం కంప్యూటర్ కోర్సు నూతన బ్యాచ్‌ను ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఇన్‌చార్జి తరిగొప్పుల రమేశ్, ట్రైనర్స్ కాశీరాం, సాయిభవాని, బాలమణి, రాంకీ సీఎస్‌ఆర్ మహేంద్రబాబు, ప్రశాంత్, పుంజాల భాస్కర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...