గ్రామాల్లో మిషన్ ఇంద్రధనుష్


Thu,November 14, 2019 11:50 PM

ఆలేరు రూరల్ : ఈనెల 11 నుంచి 19 వరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ ఇంద్ర ధనుష్ కార్యక్రమం మండల వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతుంది. గురువారం శారాజీపేట పీహెచ్‌సీ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలోని సబ్‌సెంటర్ల ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఐదేండ్లలోపు పిల్లలు, గర్భిణుల వివరాలను నమోదు చేస్తూ వివిధ కారణాల వల్ల వ్యాక్సీన్లు వేసుకోని పిల్లలను గుర్తిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు రత్నబాయి, సునీత, ఆశ వర్కరర్లు ఆకుల మాధవి, మిర్యాల స్వరూప, గంగుల లలిత, మాటూరి నీలవేణి తదితరులు పాల్గొన్నారు.

మిషన్ ఇంద్ర ధనుష్ కోసం ఇంటింటి సర్వే..
ఆత్మకూరు(ఎం) : ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ ఇంద్ర ధనుష్ కోసం గురువారం ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రతి ఇంటిలోని కుటుంబ సభ్యుల వివరాలతోపాటు గర్భిణులు, ఐదేండ్లలోపు పిల్లల వివరాలు సేకరించారు. సర్వేలో సేకరించిన వారి వివరాలను ఈనెల 21 వరకు రిజిస్ట్రేషన్‌లో నమోదు చేసి వచ్చే నెల 2 నుంచి 9 వరకు ఐదేండ్లలోపు పిల్లలకు టీకాలు వేయనున్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...