మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తా


Thu,November 14, 2019 11:49 PM

ఆలేరు టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు కృషి చేస్తానని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, ఆలేరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి మందడి ఉపేందర్‌రెడ్డి అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులను కలిసి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీరు - పారిశుధ్యంకు సంబంధించిన కార్యక్రమాలకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

పాఠశాలకు మిషన్ భగీరథ నీరు అందిస్తామన్నారు. డీఆర్‌డీవో ద్వారా నిర్మిస్తున్న తరగతి గదుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం ఆయన ఎన్‌సీసీ విద్యార్థులతో మాట్లాడుతూ ఎన్‌సీసీ విద్యార్థుల ప్రతిభ గురించి తాను విన్నానని, ఈ రోజు చూస్తున్నానన్నారు. కొంతకాలంగా ఎన్‌సీసీ విద్యార్థులు పాఠశాలకు మంచి పేరు తెస్తున్నారని వారిని అభినందించారు. ఈ సందర్భంగా ఎన్‌సీసీ విద్యార్థులు ఆయనకు గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు సూరేపల్లి నారాయణ, ఇందిరా ప్రేమజ్యోతి, ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేశ్, ఉపాధ్యాయులు హరినాథ్‌రెడ్డి, శ్యాంసుందరి, చంద్రశేఖర్, మంద సోమరాజు, ఉషారాణి, నవీన్, సాంబశివ, కవిత, ఎండీ ఖాజా అలీ, సత్యనారాయణ, రాంరెడ్డి, కవిత, వేణు, మీరా, స్వాతి తదితరులు పాల్గొన్నారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...

Featured Articles