జీవ వైవిద్య కమిటీ జిల్లా కార్యదర్శిగా ముత్యాల మహిపాల్‌రెడ్డి నియామకం


Thu,November 14, 2019 11:49 PM

భూదాన్‌పోచంపల్లి : జిల్లా జీవ వైవిద్య యాజమాన్య కమిటీ జిల్లా కార్యదర్శిగా మండల పరిధిలోని దేశ్‌మఖి గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ముత్యాల మహిపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గురువారం నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ తన నియామకానికి సహకారించిన జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డికి , భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి, ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డికి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డికి టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...