భువనగిరి మున్సిపాలిటీని సందర్శించిన 41 మంది ప్రతినిధుల బృందం


Wed,November 13, 2019 11:48 PM

-మూడు గంటల పాటు పరిశీలన
-పనితీరు బాగుందని కితాబు
- చెత్తను ఎరువుగా తయారు చేసే విధానాన్ని వివరించిన మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ
భువనగిరి అర్బన్: పీటీఆర్‌ఐ నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ట్రైనింగ్‌లో భాగంగా 24 దేశాలకు చెందిన 41 మంది ప్రతినిధుల బృందం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రిసోర్స్ పార్క్‌ను సందర్శించింది. బుధవారం సీనియర్ అసిస్టెంట్ మహ్మద్ ఖాదర్, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ షేక్ అలావల్లీ ఈ బృందానికి స్వాగతం పలికారు. అనంతరం రిసోర్స్ పార్క్‌లోని తడి, పొడి చెత్త వేరు చేయుట, కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ కవర్లను వేరు చేయు విధానం, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణ, చెత్త సేకరణ, శానిటేషన్ విభాగం సిబ్బంది పనితీరు, చెత్త సేకరణకు ఉపయోగించే వాహనాల పని విధానాన్ని వారికి వివరించారు. అనంతరం విదేశీ ప్రతినిధుల బృందంతో మున్సిపల్ కమిషనర్ సమావేశం ఏర్పాటు చేశారు.

డంపింగ్ యార్డు నిర్వహణ తీరును వివరించారు. ఆయా విభాగాల పని తీరును అడిగి తెలుసుకోవడంతో పాటు విదేశీ బృందం సుమారు మూడు గంటల పాటు రిసోర్స్ పార్కులో గడిపారు. కార్యక్రమంలో మున్సిపల్ ఇంజినీర్ ఆర్.పట్టాభీ, మేనేజర్ శ్రీధర్‌రెడ్డి, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్ మహేశ్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కుమార్, స్వామి, సిబ్బంది పాల్గొన్నారు.

81
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...